BCCI : దిగొచ్చిన బీసీసీఐ.. ఆటగాళ్లు ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!

దుబాయ్‌కి ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను వెంట తెచ్చుకోవచ్చని బీసీసీఐ చెప్పింది. అయితే, ఇందుకో షరతు పెట్టినట్లు సమాచారం. ఛాంపియన్స్‌ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది.

New Update
bcci rules

దుబాయ్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో భారత క్రికెట్ జట్టు సభ్యులు తమ కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకెళ్లడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) అనుమతించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు పెట్టింది బోర్డు.  బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత ఆటగాళ్లు, స్టాఫ్‌కు కొన్ని కఠిన  నియమాలను బోర్డు అమలు చేసింది. క్రికెటర్లు తమ భాగస్వాములు, కుటుంబసభ్యులను వెంట తీసుకెళ్లడం సహా పలు సౌలభ్యాల విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది. 

Also Read :  బట్టలు ఊడదీసి నిలబెడతా.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్.. వీడియో వైరల్!

మార్గదర్శకాలలో సడలింపు

అయితే జారీ చేసిన మార్గదర్శకాలలో కొంత సడలింపు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.  ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులను అనుమతి ఇస్తామని బోర్డు స్పష్టం చేసింది. అంటే ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను ఏ మ్యాచ్‌కు ఆహ్వానించాలనుకుంటున్నారో ముందుగా బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుంది.  

Also Read :  మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో

అనంతరం బోర్డు తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. బీసీసీఐ అంతకుముందు ఉన్న రూల్స్ చూసుకుంటే  45 రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్న విదేశీ పర్యటనలలో మాత్రమే ఆటగాళ్లు తమ కుటుంబాలతో రెండు వారాల పాటు ఉండటానికి అనుమతి ఉండేది.  

ఇక ఛాంపియన్స్ ట్రోఫీ రేపటి నుంచి అంటే 2025 ఫిబ్రవరి 19నుంచి మొదలు కానుంది. మొదటి మ్యాచ్ పాకిస్తాన్,  న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 20న భారత జట్టు బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. పాక్, భారత్ జట్ల మధ్య ఫిబ్రవరి 23వ తేదీన మ్యాచ్ జరగనుంది.  

Also Read :  సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...

ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 21 - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 - దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 - న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 - సెమీ-ఫైనల్-1, దుబాయ్
మార్చి 5 - సెమీ-ఫైనల్-2, లాహోర్
మార్చి 9 - ఫైనల్, లాహోర్ (భారత్ ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో ఆడతారు)
మార్చి 10 - రిజర్వ్ డే

Also Read:   నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో!

Advertisment
తాజా కథనాలు