Pakistan: బుద్దిమార్చుకోని పాక్.. భారత్ను అవమానించేలా చిల్లర చేష్టలు!

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే కొత్త వివాదం తలెత్తింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 7 దేశాల జెండాలను కరాచీ నేషనల్ స్టేడియం పైన ఎగురవేశారు. కానీ ఇందులో భారత త్రివర్ణ పతాకం మాత్రం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
pcb board

మరో రెండు రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ప్రారంభం కానుంది. ట్రోఫీలోని మ్యాచ్‌లు పాకిస్తాన్‌ (Pakistan) లోని మూడు నగరాలు (లాహోర్, కరాచీ, రావల్పిండి)తో పాటుగా దుబాయ్‌లలో జరగనున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ తోత టోర్నమెంట్ ప్రారంభం కానుంది.  కరాచీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక భారత జట్టు ఫిబ్రవరి 20వ తేదీన  దుబాయ్ లో బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం 23వ తేదీన ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 

Also Read :  చూసి రెండేళ్లు...మాట్లాడి ఏడాది..కుమారుడ్ని తలచుకుని ఎమోషనల్ అవుతున్న ధావన్‌!

అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే కొత్త వివాదం తలెత్తింది. ఓ వైరల్ వీడియో ఈ వివాదానికి కారణమైంది. ఇంతకు ఏం జరిగిదంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 7 దేశాల జెండాలను కరాచీ నేషనల్ స్టేడియం పైన ఎగురవేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు, అయితే ఇందులో భారత త్రివర్ణ పతాకం లేదు. ఇది భారత అభిమానులను షాక్ కు గురిచేసింది. భారత జెండాను (Indian Flag) ఎందుకు ఎగురవేయలేదనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.  టీమిండియా జట్టు పాకిస్తాన్‌లో ఏ మ్యాచ్ ఆడదని అందుకే జెండాపెట్టలేదని కొంతమంది వాదిస్తున్నారు. 

Also Read :  IPL ప్రియులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్‌లు!

ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక దేశం ఓ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంటే, ఆ టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని దేశాల జెండాలను ఎగురవేయాలి. కానీ పాక్ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిందని చెప్పాలి.  భద్రతా సమస్యల కారణంగా, భారత ప్రభుత్వం టీమిండియాను పాకిస్తాన్ కు పంపించడానికి అనుమతించడం లేదు. దీంతో ఈ టోర్నమెంట్ కోసం ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ను ఎంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా  భారత్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ జట్లు గ్రూప్ Aలో ఉన్నాయి. B గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల నుండి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీ-ఫైనల్‌లో గెలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి. 

Also Read :  టీమ్ ఇండియా తరువాతి కెప్టెన్ బుమ్రా...రోహిత్ ను ఒప్పించిన బీసీసీఐ

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...

ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 21 - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 - దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 - న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 - సెమీ-ఫైనల్-1, దుబాయ్
మార్చి 5 - సెమీ-ఫైనల్-2, లాహోర్
మార్చి 9 - ఫైనల్, లాహోర్ (భారత్ ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో ఆడతారు)
మార్చి 10 - రిజర్వ్ డే

Also Read :  అల్లు అర్జున్ అయితే ఒకలా.. కృష్ణవేణి అయితే మరోలానా? టాలీవుడ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు