IND VS PAK Final: మూడోసారి ముచ్చటగా...ఫైనల్స్ కి పాకిస్తాన్..భారత్ తో ఫైట్

ఆసియా కప్ టోర్నీలో మొత్తానికి గెలుస్తూ, ఓడుతూ పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఓడించింది పాక్ జట్టు. ఫైనల్ లో టీమ్ ఇండియాతో తలపడనుంది. 

New Update
pak taem

బంగ్లాదేశ్(bangladesh) ను 11 పరుగుల తేడాతో ఓడించి, భారత్ తో ఆసియా కప్ 2025 ఫైనల్(Asia Cup 2025 Final) కు పాకిస్తాన్ సిద్ధమైంది.  ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లమధ్య డిసైడింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇరు జట్లూ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాయి.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు తక్కువ స్కోరఏ చేసింది.  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులను మాత్రమే కొట్టింది. మహ్మద్ హారిస్ (31) టాప్ స్కోరర్. మహ్మద్ నవాజ్ (25), సల్మాన్ అఘా (19), షాహీన్ అఫ్రిది (19), ఫకర్ జమాన్ (13), ఫహీమ్ అష్రఫ్ (14*) పరుగులు చేశారు. సైమ్ అయూబ్ డకౌట్ కాగా.. సాహిబ్జాదా ఫర్హాన్ (4), హుస్సేన్ తలాత్ (3) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, రిషాద్ హొస్సేన్ 2,  మెహిదీ హసన్ 2, ముస్తాఫిజుర్ రెహమన్ ఒక వికెట్ పడగొట్టారు. 

Also Read :  కచ్చితంగా భారత్‌ను ఓడిస్తాం..  పాకిస్తాన్ కెప్టెన్ సంచలన కామెంట్స్

సూపర్ బౌలింగ్...

పాకిస్తాన్(pakistan) స్కోర్ చూశాక బంగ్లాదేశ్ బ్యాటర్లు దీనిని ఈజీగా కొట్టేస్తారు అనుకున్నారు అందరూ. కానీ రెండో ఇన్నింగ్స్ లో పాక్ బౌలర్లు విజృంభించేశారు.  వేగంగా వికెట్లను తీస్తూ బంగ్లా బ్యాటర్లను టార్గెట్ చేరనీయకుండా కట్టడి చేశారు. దీంతో బంగ్లాదేశ్ చివరికి 9 వికెట్లకు 124 పరుగులకే పరిమితమై ఆటను స్వల్ప తేడాతో కోల్పోయింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ను 11 పరుగుల తేడాతో ఓడించి 2025 ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంది.  ఫైనల్ లో భారత్ తో పాక్ తలపడనుంది. 

Also Read :  భారత్ vs పాకిస్థాన్ .. 41 ఏళ్లలో తొలిసారి

Advertisment
తాజా కథనాలు