Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితి కారణంగా ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నది.