Asia Cup Final 2025 : భారత్ vs పాకిస్థాన్ .. 41 ఏళ్లలో తొలిసారి

ఆసియా కప్ 2025లో ఫైనలిస్టులు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 28 ఆదివారం రోజున జరిగే ఫైనల్లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.  

New Update
Ind vs Pak

ఆసియా కప్ 2025 లో ఫైనలిస్టులు(Asia Cup Final 2025) ఖరారయ్యాయి. సెప్టెంబర్ 28 ఆదివారం రోజున జరిగే ఫైనల్లో టీమ్‌ఇండియా(team-india), పాకిస్థాన్(pakistan) తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.  సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది, గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై రెండు విజయాలు ,  సూపర్ 4లో కూడా విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.  మరోవైపు ఓవరాల్‌గా భారత్, పాక్ రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ -2007, ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో తలపడగా చెరో విజయం సాధించాయి. 

Also Read :  పహల్గాం దాడిపై వ్యాఖ్యలు... భారత కెప్టెన్ కు వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ

11 పరుగుల తేడాతో విజయం

ఇక బంగ్లాదేశ్‌(bangladesh) తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 20 ఓవర్లలో 135/8 రన్స్ చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో మహమ్మద్ హారిస్ (31), షాహీన్ అఫ్రిదీ (19), నవాజ్ (25) పాక్‌ను ఆదుకున్నారు. బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ 3 వికెట్లతో సత్తా చాటారు.  136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ చతికిల పడింది. 9 వికెట్లకు 124 పరుగులు మాత్రమే  చేయగలిగింది. షహీన్‌ షా అఫ్రిది (3/17), రవూఫ్‌ (3/33) సైమ్‌ అయూబ్‌ (2/16) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాను దెబ్బతీశారు. షమిమ్‌ (30) పోరాటం చేసిన ఫలితం దక్కలేదు.

ఆసియాకప్‌లో ఫైనల్ చేరిన టీమ్‌ఇండియా ఇవాళ సూపర్-4లో శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్న భారత జట్టు పాక్ తో తుది పోరుకు ముందు ఫీల్డింగ్‌లో వైఫల్యాలను అధిగమించాల్సి ఉంది. మరోవైపు 2 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక నుంచి ఎలాంటి పోటీ ఎదురవుతుందో చూడాలి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మొదలుకానుంది. 

Also Read :  దేశం కోసం విలన్ పాత్రలు కూడా చేస్తా.. బ్యాంటింగ్ ఆర్డర్ పై శాంసన్ కీలక కామెంట్స్

Advertisment
తాజా కథనాలు