/rtv/media/media_files/2025/09/26/pakistan-2025-09-26-08-37-22.jpg)
ఆసియా కప్ ఫైనల్(Asia Cup 2025 Final) లో భారత్‌తో తలపడనున్న నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా(Salman Agha) ధీమా వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించిన తర్వాత మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అఘా ఈ వ్యాఖ్యలు చేశారు. "మేము బంగ్లాదేశ్‌పై ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా లక్ష్యం కేవలం ఒక్కటే. ఫైనల్‌లో భారత్‌ను ఓడించి కప్ గెలవడమే మా లక్ష్యం. ఈ టోర్నమెంట్‌లో ఆరంభంలో మాకు కొన్ని సమస్యలు ఉన్నా, చివరికి మంచి ప్రదర్శన ఇచ్చాం. ఫైనల్‌లో కూడా ఇదే పట్టుదలతో ఆడతాం" అని అఘా అన్నారు.
Salman Ali Agha on the Final.
— Unkar 🚨™ (@I_am_Unkar_006) September 26, 2025
"We are a good enough team to beat anyone. We will come back on Sunday and try to do that." pic.twitter.com/tTc1IB55Lr
Also Read : భారత్ vs పాకిస్థాన్ .. 41 ఏళ్లలో తొలిసారి
భారత్ బలమైన జట్టు అని మాకు తెలుసు. కానీ మా ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. మేము కచ్చితంగా భారత్‌ను ఓడిస్తామని అఘా ధీమాగా చెప్పారు. ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డును గెలుచుకున్న షాహీన్ షా అఫ్రిది గురించి ఆఘా ప్రత్యేకంగా ప్రస్తావించారు. షహీన్ ఒక ప్రత్యేక ఆటగాడు. జట్టుకు అతని నుండి ఏమి అవసరమో అది అతను చేస్తాడు. అతని పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు. ఆదివారం దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఇప్పటికే నెట్స్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్(ind-vs-pak) జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
11 పరుగుల తేడాతో విక్టరీ
ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 20 ఓవర్లలో 135/8 రన్స్ చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో మహమ్మద్ హారిస్ (31), షాహీన్ అఫ్రిదీ (19), నవాజ్ (25) పాక్‌ను ఆదుకున్నారు. బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ 3 వికెట్లతో సత్తా చాటారు. 136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ చతికిల పడింది. 9 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. షహీన్ షా అఫ్రిది (3/17), రవూఫ్ (3/33) సైమ్ అయూబ్ (2/16) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాను దెబ్బతీశారు. షమిమ్ (30) పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. బంగ్లాదేశ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ జాకర్ అలీ తమ వరుస ఓటములకు తమ బ్యాటింగ్ కారణమని ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్ చేతిలో ఓడిపోయింది.
Also Read : BCCI: పాకిస్తాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ