/rtv/media/media_files/2025/08/24/dream11-2025-08-24-18-51-27.jpg)
Dream11 exits as Team India's lead jersey sponsor
ఆన్‌లైన్ గేమింగ్(Online Gaming) ను అరికట్టేందుకు ఇటీవల కేంద్రం దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో ఆమోదించిన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం భారత క్రికెట్ జట్టుపై కూడా పడింది. ఇప్పటివరకు 'డ్రీమ్ 11' టీమ్ ఇండియాకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాకతో ఒప్పందం మధ్యలోనే నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ కూడా ప్రారంభం కానుంది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. జరగబోయే ఆసియా కప్ కోసం భారత జట్టు జర్సీలను కొత్త స్పాన్సర్లతో ముద్రించాల్సి ఉంటుంది.
Also Read: నోయిడా కేసులో బిగ్ ట్విస్ట్.. వరకట్న మర్డర్ నిందితునిపై పోలీసుల కాల్పులు
Dream11 Exits As Team India's Lead Jersey Sponsor
టీమ్ ఇండియా(Team India) కు స్పాన్సర్‌షిప్ చేసేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తాయి. జెర్సీ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం త్వరలోనే కొత్త బిడ్‌లను సైతం BCCI ఆహ్వానించనున్నట్లు సమాచారం. అయితే భారత జట్టు జెర్సీపై డ్రీమ్ 11(dream-11) స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. చాలావరకు ఆటోమొబైల్ కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీ రంగాలు టీమ్ ఇండియా కోసం స్పాన్సర్‌షిప్ చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. టాటాగ్రూప్ ఐపీఎల్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యహహరిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఫ్యాన్స్ పండుగ చేసుకోండి..2027 వరల్డ్ కప్ వరకు విరాట్ , రోహిత్ ఆడ్డం పక్కా
ఈ స్పాన్సర్‌షిప్ రేసులోకి ఏంజెల్ వన్, గ్రో, జెరోధా వంటి ఫిన్‌టెక్ కంపెనీలు తమ కస్టమర్ల మరింత పెంచుకునేందుకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే అదానీ గ్రూప్, రిలయన్స్ వంటి బడా సంస్థలు కూడా ఈ రేసులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థలు ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో స్పాన్సర్‌షిప్ కోసం పోటీ పడొచ్చు.
Also Read: రష్యాకు మరో షాక్.. ఉక్రెయిన్‌కు మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా
ఇదిలాఉండగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ప్రారంభానికి చాలా తక్కువ సమయమే ఉంది. భారత జట్టుకు ఒకవేళ కొత్త స్పాన్సర్ దొరక్కపోతే ఎలాంటి స్పాన్సర్‌షిప్ లేకుండా కూడా టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి BCCI ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. మరి భారత జట్టుకు కొత్త స్పాన్సర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read: మిస్టరీ ఆలయం.. ఇందులోకి వెళ్తే మాట్లాడరు.. చూడరు.. ఇంతకీ ఎక్కడంటే?