Good News: ఫ్యాన్స్ పండుగ చేసుకోండి..2027 వరల్డ్ కప్ వరకు విరాట్ , రోహిత్ ఆడ్డం పక్కా

స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇక ఆడరంటూ చెలరేగిన పుకార్లకు బీసీసీఐ చెక్ పెట్టింది. వాళ్ళిద్దరూ వన్డేలు ఆడతారు అంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కన్ఫార్మ్ చేశారు. 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఉంటారని చెప్పారు. 

New Update
virat-rohith

Virat kohli-Rohith Sarma

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ..ప్రస్తుతం వీరిద్దరూ టెస్ట్, టీ20ల నుంచి రిటైర్ అయిపోయారు. కేవలం వన్డేలను మాత్రమే ఆడతామని చెప్పారు. అయితే కొత్త వాళ్ళు భారత జట్టులో ప్రతిభ చూపిస్తున్నారు. రీసెంట్ గా శుభ్ మన్ గిల్ సారధ్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ ను డ్రా చేసి వాహ్ అనిపించారు. దీంతో రోహిత్, విరాట్ స్థానాలపై తెగ చర్చ జరుగుతోంది. వాళ్ళిద్దరూ ఇక జట్టులోకి రారంటూ పుకార్లు బయలు దేరాయి. వన్డేల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించకపోయినప్పటికీ బీసీసీఐ ఇక మీదట వాళ్ళకు ఛాన్స్ ఇవ్వదు అంటూ ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. వీటికి రోహిత్ కానీ, విరాట్ కానీ ఏమీ స్పందించలేదు. లేదు మేము ఆడుతున్నాము అని కూడా ఎక్కడా ప్రకటించలేదు. దీంతో పుకార్లు మరింత చెలరేగిపోయాయి. అయితే ఇప్పుడు బీసీసీఐ ఈ విషయంలో రెస్పాండ్ అయింది. 

రిటైర్ మెంట్ పూర్తిగా ఆటగాళ్ళ సొంత నిర్ణయం..

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా విరాట్, రోహిత్ కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరూ వన్డే జట్టులో కచ్చితంగా ఉంటారని చెప్పారు. 2027 వరకు వన్డే జట్టులో కొనసాగాలన్నదే రోహిత్ , కోహ్లీల ఉద్దేశమని...దానికి బీసీసీఐ కూడా అంగీకరించిందని రాజీవ్ శుక్లా తెలిపారు. బీసీసీఐ ఎప్పుడూ ఆటగాళ్ళను రిటైర్ అవ్వమని అడగదని క్లారిఫై చేశారు. వాళ్ళిద్దరి లాంటి అనుభవజ్ఞులు అవసరం జట్టుకు ఇంకా ఉందని రాజీవ్ అన్నారు. దానికి తోడు స్టార్ ఆటగాళ్ళు ఇద్దరూ ఫిట్ గా ఉన్నారని..ఏ రకంగానూ వాళ్ళని ఆడొద్దని చెప్పలేమని అన్నారు. ప్రపంచ కప్ ముందు భారత జట్టు ఎక్కువ వన్డేలు ఆడటం లేదు. ఇలాంటి టైమ్ లో విరాట్, రోహిత్ లకు ఫిట్‌నెస్ కాపాడుకోవడం కాస్త కష్టమైన పనే..కానీ దానికి వాళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆస్ట్రూేలియా టూర్ తర్వాత స్టార్ లు ఇద్దరూ ఆడరని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని రాజీవ్ శుక్లా కొట్టి పారేశారు. అయినా రిటైర్ మెంట్ అనేది పూర్తిగా ఆటగాళ్ళ నిర్ణయం..బీసీసీఐ అందులో ఎప్పుడూ జోక్యం చేసుకోదు అని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు