/rtv/media/media_files/2025/08/24/latu-devta-temple-2025-08-24-17-17-59.jpg)
Latu Devta Temple (Twitter)
ఎత్తయిన మంచు కొండలు, పచ్చని లోయల మధ్య ఓ లాతు దేవతా మందిరం ఉంది. ఆ ఆలయంలో వింత ఆచారాలు అన్ని ఉన్నాయి. ఇప్పటికీ వీటి వెనుక ఉన్న మిస్టరీ(Mystery Temple) గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ లాతు దేవతా మందిరం స్పెషల్ ఏంటి? ఎందుకు ఈ మందిరాన్ని మిస్టరీ ఆలయం అంటారు? అనే పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
ఇది కూడా చూడండి: Vinayaka Chavithi 2025: 500 ఏళ్ల తర్వాత ప్రత్యేకమైన వినాయక చవితి.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్ట యోగం!
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న వాన్ గ్రామంలో 8500 అడుగుల ఎత్తులో ఈ లాతు దేవతా ఆలయం(Latu Devta Temple) ఉంది. చాలా హిందూ దేవాలయాల మాదిరిగా ఇక్కడ దేవతా విగ్రహం కనిపించదు. భక్తులు దూరం నుంచే ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న శక్తివంతమైన నాగమణి (సర్ప రత్నం) ఉన్నట్లు సమాచారం. ఈ ఈ రత్నాన్ని చూసిన వారికి అంధత్వం వస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోకి వెళ్తే మాట్లాడలేరు, చూడలేరు.
లాతు దేవత ఎవరు?
పురాణాల ప్రకారం లాతు దేవత గర్హ్వాల్ ప్రాంతంలో పూజించే దేవత నందా దేవి సోదరుడు. లాతు దేవత నందా దేవికి సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఒకసారి ఆయన తన సోదరి ఊరేగింపులో భాగంగా వాన్ గ్రామంలో రాత్రి బస చేశాడు. అక్కడ ఒక వృద్ధ మహిళ ఆయనకు నీరు ఇచ్చింది. కానీ అక్కడ రెండు కుండలు ఉన్నాయి. అందులో ఒకటి నీటితో, మరొకటి స్థానిక మద్యంతో ఉంది. అయితే లాతు దేవత నీటికి బదులుగా మద్యం తాగాడు. ఈ తప్పుకు శిక్షగా, అతను శాశ్వతంగా ఆ గ్రామంలోనే ఉండి ఆ నివాసులను రక్షించాలని శిక్ష విధించారు. మరో పురాణం ప్రకారం లాతు దేవత వాన్ ప్రాంతంలో జ్ఞానోదయం పొందిన ఒక సంచార సన్యాసి. ఆయన ఆధ్యాత్మిక శక్తిని గుర్తించిన గ్రామస్తులు ఆయన్ని దేవతగా పూజించడం మొదలుపెట్టారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. లాతు దేవతా ఆలయం సంవత్సరానికి ఒక్కసారే ఓపెన్ చేస్తారు. ఆ రోజున నందా దేవి రాజ్ జాత్ యాత్రలో భాగంగా పెద్ద జాతర జరుగుతుంది. దేవత తన సోదరి నందా దేవిని పలకరిస్తుందని నమ్ముతారు. ఈ రోజున పూజారి కళ్లకు గంతలు కట్టుకుని, శ్లోకాలు చదువుతూ ఆలయం వద్దకు చేరుకుంటాడు. దైవమే అతని అడుగులను నడిపిస్తుందని భక్తులు నమ్ముతారు. పూజలో పువ్వులు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత విష్ణు సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని పూజ చేయడం అనేది పూజారికి దైవంపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి చిహ్నం. నాగమణి నమ్మకాన్ని చాలామంది స్థానికులు బలంగా విశ్వసిస్తారు.
ఆలయానికి ఎలా చేరుకోవాలి?
లాతు దేవతా ఆలయానికి చేరుకోవాలంటే హిమాలయాల గుండా ప్రయాణం చేయాలి. ఈ ఆలయానికి చేరుకోవడం చాలా కష్టం. కానీ అనుభూతి చాలా బాగుంటుంది. రిషికేష్ వెళ్లి అక్కడి నుంచి అలకనంద, మందాకిని నదుల సంగమ స్థలంలో ఉన్న కర్ణప్రయాగ్‌కు షేర్డ్ టాక్సీలో లేదా బస్సులో వెళ్లాలి. ఈ ప్రయాణానికి దాదాపు 4-5 గంటలు పడుతుంది. కర్ణప్రయాగ్ నుంచి లాతు దేవతా ఆలయం ఉన్న వాన్ గ్రామం వరకు దాదాపు 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ పూర్తి చేయడానికి సుమారు 6-8 గంటలు పడుతుంది. ఈ గ్రామంలో చాలా తక్కువగా వసతి సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే అన్ని బుక్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ ఆలయానికి వెళ్లాలంటే హైకింగ్ బూట్లు, వెచ్చని దుస్తులు తీసుకెళ్లాలి.
ఇది కూడా చూడండి: Vinayaka Immersion: 3,5,7,9,11 రోజుల్లో.. వినాయక నిమజ్జనం ఎప్పుడు చేస్తే మంచిది?