/rtv/media/media_files/2025/08/24/police-fire-on-dowry-murder-accused-2025-08-24-16-42-14.jpg)
Noida Encounter
గ్రేటర్ నోయిడా(Greater Noida) లో వరకట్నం(Dowry Case) భార్యను మర్డర్ చేసిన నిందితునిపై పోలీసులు కాల్పులు జరపడం సంచలనం రేపింది. నిందితుడు విపిన్ పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈక్రమంలో నిందితుడు విపిన్ కాలికి గాయం కాగా.. పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా నిందితుడు మాట్లాడుతూ తన భార్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. నిఖీ తాను గొడవ పడిన మాట వాస్తవమేనని, ఆమెను కొట్టిన విషయం కూడా నిజమేనని విపిన్ అన్నాడు. ఆ తర్వాత ఆమెనే తనకు తానుగా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించాడు.
#WATCH | Greater Noida, UP | Accused of murdering his wife Nikki over dowry demands, Vipin Bhati brought to the hospital for treatment, after he was shot in the leg during an encounter with the police. pic.twitter.com/DZMuAenvX5
— ANI (@ANI) August 24, 2025
Also Read:Rasha Thadani: అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్! ఘట్టమనేని హీరోతో రవీనా టాండన్ కూతురు
Big Twist In Noida Case
గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో నిఖీ అనే వివాహితను ఆమె భర్త, అత్తమామలు కలిసి కట్నం కోసం దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు నిప్పుపెట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యకు నిఖీ ఐదేళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. 'అమ్మను నాన్నే కాల్చి చంపేశారు' అని ఆ చిన్నారి చెప్పిన మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆ కేసులో నిఖీ భర్త విపిన్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన లిక్విడ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అతడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా నిఖిని హింసిస్తున్న సమయంలో మృతురాలి అక్క తీసిన వీడియో కూడా సంచలనంగా మారింది. ఆమెతో పాటు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: రూ. 500 పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని.. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు!
కాగా, విపిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని సంఘటన స్థలానికి తీసుకెళ్లిన సమయంలో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి నిందితుడిపై కాల్పులు జరిపినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం అయింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విపిన్ అరెస్టు కాగా, అతని తల్లి దయా, తండ్రి సత్యవీర్, సోదరుడు రోహిత్ పరారీలో ఉన్నారు.
ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘మేము విపిన్‌ను ఈ రోజు అతడి ఇంటికి తీసుకెళ్లాము. భార్య నిఖీని కాల్చడానికి ఉపయోగించిన లిక్విడ్ ఉన్న బాటిల్ రికవర్ చేసుకోవడానికి అతన్ని వెంట తీసుకువెళ్లాం. అప్పుడు విపిన్ ఓ పోలీసు దగ్గరినుంచి తుపాకిని లాక్కున్నాడు. కాల్పులకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే మేము కూడా ఎదురు కాల్పులు జరిపాము. దీంతో అతడి కాలికి గాయం అయింది’ అని తెలిపారు.
Also Read:Deepika Padukone Baby: సేమ్ టూ సేమ్ దీపికా.. కూతురు 'దువా' ఫేస్ రివీల్ అయ్యింది! వీడియో వైరల్