/rtv/media/media_files/2025/08/24/putin-and-trump-2025-08-24-17-22-34.jpg)
Trump greenlights more than 3,000 ERAM air-to-air missiles for Ukraine
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం(Russia Ukraine War) ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఆపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దీనిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలస్కాలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్.. జెలెన్‌స్కీతో కూడా సమావేశమై కీలక అంశాల గురించి చర్చించారు. అయినప్పటికీ యుద్ధం ముగింపు అంశం ఇరుదేశాల మధ్య కొలిక్కి రాలేదు. అయితే తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఉక్రెయిన్ తమ ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి 3,350కి పైగా ఎక్స్‌టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ మిసైల్స్‌ను అందించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
Also Read: నోయిడా కేసులో బిగ్ ట్విస్ట్.. వరకట్న మర్డర్ నిందితునిపై పోలీసుల కాల్పులు
Trump Greenlights For Ukraine
ఈ ఆయుధాల కోసం యూరోపియన్ దేశాలు(Europian Countries) నిధులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు వారాల్లోనే ఈ మిసైల్స్ ఉక్రెయిన్‌కు చేరుకుంటాయని తెలుస్తోంది. 240 నుంచి 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ERAM మిసైల్స్‌ను రష్యా పైకి ప్రయోగించాలంటే ఉక్రెయిన్ పెంటగాన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసే విషయంపై అమెరికా ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.
Also Read: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు
ఇదిలాఉండగా రష్యా భూభాగంలో దాడులు చేసేందుకు అమెరికా రూపొందించిన లాంగ్‌రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ ఉక్రెయిన్ వాడకుండా పెంటగాన్ అడ్డుకున్నట్లు పలు నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం రష్యా చేపడుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఆయుధాలు ఉపయోగించకుండానే ఉక్రెయిన్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తోందని చెప్పాయి. ఈ యుద్ధం ఆపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పురోగతి రాకపోవడంతో ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నాయి.
Also Read: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్
ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్‌కు సాయంగా ఇప్పటికే చాలాసార్లు అమెరికా ఆయుధరాలు సరఫరా చేసింది. ఇటీవలే అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌కు 32.2 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, అడ్వాన్స్‌డ్ మిసైల్స్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అమెరికా చట్టసభకు కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపింది. వీటిలో 15 కోట్ల డాలర్లు అమెరికా ఆర్మర్డ్ వాహనాల నిర్వహణకు, 17.2 కోట్ల డాలర్లు ఉపరితలం నుంచి గగనతలంలో ప్రయోగించే మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు వినియోగించనున్నారు. రష్యా.. ఉక్రెయిన్‌పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపిస్తున్నామని ట్రంప్ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: అదో పెద్ద తలనొప్పి..నూనె, వెనిగర్ లా కలవడం లేదు..పుతిన్, జెలెన్ సమాశంపై ట్రంప్ వ్యాఖ్య