TG NEWS: మూడు రోజుల్లోనే ఘోరం! పెళ్లి కూతురిగా వెళ్లి.. శవంగా ఇంటికి!
కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.
కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల మూలంగా శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి ఏడ్చారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడంపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. నువ్వెంతా.. నీ బతుకెంతా? అని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోడంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో ఆయనకు పోన్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఈ రోజు మరోసారి రఘునందన్‌రావుకు దుండగులు ఫోన్ చేసి బెదిరించారు.
అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సాయం చేస్తే భారీగా సొమ్ము ఇస్తామని తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి వెనజువెల అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాకు తలనొప్పిగా మారారు.
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోష్ మీదున్న ఆ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ అదే పాలసీని అనుసరించనుంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను(IT) బిల్లు-2025 ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
అచ్చంపేటలో ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్ కు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. బాలరాజు వెళ్లడంతో పార్టీకి నష్టం లేదని.. అండగా ఉంటామని భరోసానిచ్చారు.
హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించింది. అలాగే రోడ్లపై నడిచేటప్పుడు, ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది.