/rtv/media/media_files/2025/05/04/ihLLXbTRD04DvMy11rmJ.jpg)
Shock for YouTuber Anvesh
Anvesh : ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదైంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అన్వేష్ అభ్యంతర కంటెంట్ ప్రచారం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అన్వేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు అన్వేష్‌పై ఖమ్మంలోని ఖానాపురంహవేలి ఠాణాలోనూ ఇప్పటికే కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ భానుప్రకాశ్ కథనం మేరకు.. విశాఖపట్టణానికి చెందిన అన్వేష్ విదేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల అసభ్యకరంగా ఇటీవల వీడియో విడుదల చేశాడు. దీనిపై స్పందించిన దానవాయిగూడేనికి చెందిన జి.సత్యనారాయణరావు అనే వ్యక్తి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు.
విశాఖపట్నంలోనూ..
కాగా, అన్వేష్ నా అన్వేషణపై విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులకు విశ్వ హిందూ పరిషత్ ఒక ఫిర్యాదు చేసింది. హిందూ దేవతలు,భారతీయ మహిళల వస్త్రధారణ పైన అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అతనిపైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తమ ఫిర్యాదు లేఖలో ఆరోపించింది. అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్రమైన అశాంతిని రేకెత్తిస్తాయి అని విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
నటుడు శివాజీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాట్లాడిన అన్వేష్ మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ వారి పేర్కొన్నారు. అన్వేష్ మాట్లాడుతూ ఆలయాలలో ఉన్న శిల్పాలపైన ప్రపంచ హిందువులంతా దేవతగా కొలిచే సీతమ్మవారిని, ద్రౌపదిని ఉదాహరించి, వారి కాలంలో వారిని రేప్ చేశారని అవహేళన చేస్తూ భారతీయ మహిళలు హిందూ సాంప్రదాయాల పైన విసుగెత్తి విదేశాలకు వెళ్ళిపోతున్నారు అంటూ మాట్లాడటం వివాదస్పదమైంది.
భారతీయ సనాతన సంస్కృతిని కించపరుస్తూ అన్వేష్ వీడియో మహిళా మూర్తులను పుచ్చకాయతో పోల్చి, కీరా దోసకాయ చూపిస్తూ దారుణంగా ఉదాహరిస్తూ అసభ్యకరంగా ప్రదర్శిస్తూ వివిధ మతాల స్త్రీల వస్త్రాల విధానం పైన వ్యాఖ్యలు చేసారు. భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడిన మాటల పైన విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేస్తూ, తక్షణమే అతనిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.
ఇక అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ ధర్మాన్ని పాటించే నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపైన విస్తృతంగా చర్చ జరుగుతున్న పరిస్థితులలో రంగంలోకి దిగిన విశ్వహిందూ పరిషత్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖతో పాటు, అన్వేష్ మాట్లాడిన మాటల వీడియోను కూడా పోలీసులకు అందించారు. తెలుగు రాష్ట్రాలలో అతనిపైన మరిన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వం వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని వీహెచ్పి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Follow Us