/rtv/media/media_files/2025/12/31/fotojet-59-2025-12-31-10-53-50.jpg)
Gig workers get bumper offer..free ride for them
Hyderabad New Year: మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు(new year celebration) ప్రారంభం కానున్నాయి. యువత అంతా ఈ వేడుకల్లో మునిగితేలిపోనున్నారు. న్యూ ఇయర్(Happy New Year 2026) వేడుకలను ఎవరికీ నచ్చినట్లు వారు జరుపుకుంటారు. అందులో కొందరు మద్యం మత్తులో మునిగి తేలుతారు. అయితే తాగి మాములుగా ఇంటికి పోతే పర్వాలేదు. కానీ, మందు ఎక్కువయ్యాక బైక్ తీస్తానంటేనే పోలీసులు తాటా తీస్తామంటున్నారు. అయితే అలాంటి వారికి గిగ్ వర్కర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. వారు మద్యం మత్తులో స్వయంగా ఇంటికి వెళ్లలేకపోతే వారు తమకు కాల్ చేస్తే ఉచితంగా ఇంటికి చేరవేస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యుయూ) ఆఫర్ ఇచ్చింది. ఈ నెంబర్ 8977009804 కు కాల్ చేస్తే ఉచిత రైడ్ సౌకర్యాన్ని అందజేస్తామని స్పష్టం చేసింది. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు యూనియన్ వివరించింది.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.00 గంటల నుంచి జనవరి 1వ తేదీ రాత్రి 1.00 గంట వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని గిగ్ వర్కర్స్ స్పష్టం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. గత ఎనిమిదేళ్లుగా న్యూ ఇయర్ వేళ.. రాత్రుల్లో ఈ తరహా ఉచిత రైడ్స్ సేవలు అందిస్తున్నట్లు టీజీపీడబ్ల్యూయు స్పష్టం చేసింది. మద్యం తాగి వాహనం నడపలేని వారి కోసం మొత్తం 500 వాహనాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పింది. అందుకోసం క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. #HumAapkeSaathHai ప్రచారం కింద ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు యూనియన్ వివరించింది.
Also Read : డ్రగ్ పెడ్లర్ యువతి అరెస్ట్.. అడిక్ట్ నుంచి పెడ్లర్‌గా మార్పు
VC Sajjanar: రైడ్ నిరాకరిస్తే కేసులే... సీపీ సజ్జనార్ వార్నింగ్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఆటో, బైక్ రైడ్ నిరాకరిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పౌరులకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(vc-sajjanar) కోరారు. హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు కాల్ చేసి సమస్య చేప్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. రైడ్ డీటెయిల్స్ స్క్రీన్‌షాట్.. ఈ వాట్సాప్ నెంబర్‌కు పంపించాలని కోరారు. ఈ ఫిర్యాదుకు వాహన నెంబర్, సమయం, ప్రదేశం వివరాలు తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు.
On New Year’s Eve and at midnight, any refusal by cab or auto drivers to accept rides, or any demand for fares higher than the booked amount, will not be tolerated.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 30, 2025
Strict action will be taken against violators under Section 178(3)(b) of the Motor Vehicles Act.
If you face any… https://t.co/niAbBd6VIG
Also Read : BRSలో కీలక మార్పులు.. హరీశ్ రావుకు ప్రమోషన్
ఈ రోజు బుధవారం (డిసెంబర్ 31వ తేదీ) అర్థరాత్రి క్యాబ్, ఆటో రైడ్‌కు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డిమాండ్ చేస్తే కూడా కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటర్ వాహనాల చట్టం 178 (3)(b) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వివరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా వీసీ సజ్జనార్ క్యాబ్, ఆటో, బైక్ డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చారు.
Follow Us