/rtv/media/media_files/2025/12/31/health-ministry-bans-nimesulide-oral-doses-above-100-mg-over-safety-concerns-2025-12-31-14-48-23.jpg)
Health Ministry Bans Nimesulide Oral Doses Above 100 Mg Over Safety Concerns
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెలుసులైడ్ తయారీ విక్రయాలపై ఆంక్షలు విధించింది. నోటీ ద్వారా తీసుకునే ఈ మెడిసిన్ అధిక డోసులను నిషేధించింది. నిమెసులైడ్ 100 ఎంజీకి మించి డోసు ఉన్న ఔషధాల తయారీ, విక్రయాలను వెంటనే ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో చర్చించిన తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. ఆ విషయంలో కేసు నమోదు
నిమెసులైడ్ 100 ఎంజీ కన్నా ఎక్కువ డోసు ఉండేది తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ మెడిసిన్‌కి బదులు ప్రత్యామ్నాయ ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. అందుకే వీటిని వెంటనే నిషేధిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో నిమెసులైడ్ అధిక డోసు ఔషధం తయారీ, పంపిణీ, విక్రయాలపై ఈ నిషేధం ఉండనుంది. తక్కువ డోసు ఫార్ములా ఉండే నిమెసులైడ్ మాత్రం మార్కెట్‌లో అందుబాటులోనే ఉంటుందని పేర్కొంది.
Also Read: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.. US షాకింగ్ రిపోర్ట్!
వాస్తవానికి నిమెసులైడ్ అనేది నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్. దీనివల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఉన్నట్లు గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా లివర్‌పై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్లు గతంలో కూడా పలువులు నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఔషధం అధిక డోసు వినియోగంపై నిషేధం విధించింది. ఇదొక్కటే కాదు.. గతంలో కూడా కేంద్రం ఇలా పలు అధిక ఔషధాలను నిషేధించింది.
Follow Us