/rtv/media/media_files/2025/12/31/batti-vikramarka-2025-12-31-17-17-31.jpg)
Batti vikramarka
రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్‌కు సంబంధించి రూ.713 కోట్లు బుధవారం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ.700 కోట్ల చొప్పు రిలీజ్ చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిసెంబర్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఫుల్లుగా తాగి పడిపోతే ఇంటిదగ్గర దింపేస్తాం.. న్యూఇయర్ వేడుకల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం
గత కొన్నేళ్లుగా ఉద్యోగుల గ్రాట్యుటీ, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, అడ్వాన్స్‌లకు సంబంధించి పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. ఇవి దాదాపు రూ.10 వేల కోట్లకు చేరాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు జూన్‌లో ఆందోళనకు సిద్ధమయ్యాయి. దీంతో ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మొదటిసారిగా జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు రిలీజ్ చేసింది. అనంతరం ఆగస్టు నుంచి రూ.700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ వస్తోంది.
Also Read: కారులో భారీగా పేలుడు పదార్ధాలు..న్యూ ఇయర్ వేడుకల్లో ఢిల్లీ తరహా పేలుళ్లకు ప్లాన్?
Follow Us