/rtv/media/media_files/2025/01/13/FM3E6ygnFsvN9ACwWaMv.jpg)
china Vs bharath Photograph: (china Vs bharath)
సరిహద్దుల వెంట తరుచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ పై భారీగా టారిఫ్(tarriffs) విధించింది. ఈ విషయమై రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసి చైనాకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. దిగుమతి(India imports) అవుతున్న స్టీల్ తక్కువ ధర కావడం, దేశీయ ఉక్కు పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఎంపిక చేసిన కొన్ని స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి టారిఫ్ ను పెంచింది. చైనా నుండి వస్తున్న చవకైన ఉక్కు దిగుమతుల నుండి దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Also Read : రహస్యంగా పాక్ ఆర్మీ చీఫ్ కుమార్తె పెళ్లి.. వరుసకు అన్నఅయ్యేవాడితో..
India Gave A Huge Shock To China
కాగా ప్రస్తుత నిర్ణయాన్ని అనుసరించి మొదటి సంవత్సరంలో 12 శాతం టారిఫ్ ఉంటుంది. ఇది రెండో సంవత్సరానికి గరిష్ఠంగా 11.5 శాతానికి చేరుతుంది. మూడో సంవత్సరానికి 11 శాతానికి తగ్గుతుంది. ఈ తాజా టారిఫ్.. ఒక్క చైనాకు మాత్రమే పరిమితం కాలేదు. వియత్నాం, నేపాల్ నుండి దిగుమతి చేసుకునే స్టీల్ కు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. అదే సమయంలో స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు ఇది వర్తించదని వివరించింది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ముడి ఇనుము ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ గత కొంతకాలంగా చైనా నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. దీనికి కారణం మన కంటే తక్కువ ధరకు ముడి ఇనుము లభిస్తోండటమే . ఇది- దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులకు సవాల్ గా మారింది. పైగా యాంటీ-డంపింగ్ ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ ధోరణి ఉక్కు పరిశ్రమపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నట్లు భారత అధికారులు గుర్తించారు. చవకైన దిగుమతులు, నాణ్యత రహిత ఉత్పత్తులతో పాటు దేశీయ ఉక్కు పరిశ్రమకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో కేంద్రం టారిఫ్ పెంచింది.
చైనా నుంచి భారీ మొత్తంలో స్టీల్ దిగుమతులు అకస్మాత్తుగా పెరగడంతో దేశీయ పరిశ్రమకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇదిలా కొనసాగితే దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో అదనపు టారిఫ్ విధించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) సిఫారసు చేసింది. 2025 ఏప్రిల్‌లో కేంద్రం 200 రోజుల పాటు విదేశీ దిగుమతులపై 12 శాతం తాత్కాలిక టారిఫ్ విధించింది. ఇది నవంబర్ తో ముగిసింది. దీంతో మరోసారి టారిఫ్ విధిస్తూ భారత్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us