ఫుల్లుగా తాగి పడిపోతే ఇంటిదగ్గర దింపేస్తాం.. న్యూఇయర్‌ వేడుకల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మరికొన్ని గంటల్లో న్యూఇయర్‌ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల్లో మితిమీరి మద్యం సేవించిన వాళ్లను వారి ఇళ్ల దగ్గర దింపుతామని పేర్కొంది.

New Update
Karnataka government to drop ‘heavily drunk’ people home during New Year’s Eve celebrations

Karnataka government to drop ‘heavily drunk’ people home during New Year’s Eve celebrations

మరికొన్ని గంటల్లో న్యూఇయర్‌ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల్లో మితిమీరి మద్యం సేవించిన వాళ్లను వారి ఇళ్ల దగ్గర దింపుతామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు పోలీసులే ఈ బాధ్యతను తీసుకుంటారని చెప్పారు. ప్రతిఒక్కరిని కూడా ఇంటిదగ్గర దిగబెట్టడం వీలు కాదు. అందుకే మత్తు దిగేవరకు వాళ్లను ఉంచేందుకు 15 ప్రాంతాలు ఎంపిక చేసినట్లు తెలిపారు.   

Also Read: క‌త్తులు పంచిన హిందూ నేతల వీడియో వైర‌ల్.. 10 మంది అరెస్ట్

అంతేకాదు తాగినమైకంలో ఎవరైన అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పబ్‌లు, బార్‌లలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తామని తెలిపారు. పలు జిల్లాలతో ఈ సమస్య లేదని అన్నారు. కానీ ఎక్కువగా రద్దీ ఉండే బెంగళూరు, మైసూర్‌, హుబ్బళి, మంగళూరు, బెలగావిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.  దీనిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

Also Read: 31 మధ్యాహ్నం 3:30కే అక్కడ 2026 న్యూఈయర్ సెలబ్రేషన్స్.. భారత్‌తో పాటు 43 దేశాలు

ట్రాఫిక్, మహిళల భద్రత దృష్ట్యా బెంగళూరు వ్యాప్తంగా 20 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. వాళ్లలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా టీమ్‌ కూడా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు న్యూఇయర్ వేడుకల్లో మద్యం తాగిన వారికి ఫ్రీ సేవలు అందించనున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ ఫాం వర్కర్స్‌ యూనియన్‌ (TGPWU) ప్రకటించింది. ఇందుకోసం క్యాబ్‌లు, ఈవీ బైక్‌లు, ఆటోలు కలిపి మొత్తం 500 వాహనాలను రెడీ చేసినట్లు తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు