Putin: ఉక్రెయిన్ భూభాగం ఆక్రమణపై పుతిన్ సంచలన ఆదేశాలు

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ భూభాగాన్ని మరింత ఆక్రమించుకునేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో బఫర్‌ జోన్‌ పెంచమని తమ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు రష్యా జనరల్ వాలేరి గెరసిమోవ్‌ అన్నారు.

New Update
Putin ordered Ukraine buffer zone expansion in 2026, says Russia's top general Gerasimov

Putin ordered Ukraine buffer zone expansion in 2026, says Russia's top general Gerasimov

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల పుతిన్‌ అధికారిక నివాసంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు చేసిందని రష్యా ఆరోపించడం సంచలనం రేపింది. ఉక్రెయిన్ మాత్రం దీన్ని ఖండించింది. ఈ క్రమంలోనే రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ భూభాగాన్ని మరింత ఆక్రమించుకునేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో బఫర్‌ జోన్‌ పెంచమని తమ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు రష్యా జనరల్ వాలేరి గెరసిమోవ్‌ అన్నారు. 

Also Read: ఉత్తరాఖండ్‌లో రెండు లోకో రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు

ఈ క్రమంలోనే రష్యా సైన్యం సుమీ, ఖర్కీ్వ్ ప్రాంతాల్లో గ్రామాలను ఆక్రమించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు రష్యా జనరల్ వాలేరి గెరసిమోవ్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  

Also Read: 31 మధ్యాహ్నం 3:30కే అక్కడ 2026 న్యూఈయర్ సెలబ్రేషన్స్.. భారత్‌తో పాటు 43 దేశాలు

మరోవైపు సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ చొరబాట్లకు ఛాన్స్ ఉందని తెలియడంతో సరిహద్దుల వెంట భద్రతా బఫర్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని పుతిన్‌ గతంలోనే ఆదేశించారు. కానీ ఆ జోన్ అనేది ఎక్కడిదాకా ఉందో అనే దానిపై సైనిక అధికారులకు క్లారిటీ లేదు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ ఈశాన్య సుమీ ప్రాంతంలో నాలుగు సరిహద్దు గ్రామాలను రష్యా సీజ్‌ చేసింది. అయితే తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో మాత్రం సరిహద్దుల్లో బఫర్‌ జోన్లను విస్తరించాలని పుతిన్‌ ఆదేశించారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పంద చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇరువైపుల దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీంతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నిపుణులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు