MP: ఆఫ్రికా నుంచి మరో 8 చీతాలు భారత్ కు..
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని కఠ్నీ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు మద్యం తాగించాడు టీచర్ లాల్ నవీన్ ప్రతాప్ సింగ్. ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు కొందరు వ్యక్తులు. దీంతో ప్రతాప్ సింగ్‌ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఎన్టీయే నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందులో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది. వారు ఫోర్జరీ దస్త్రాలు ఉపయోగించారని గుర్తించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు.
కెనడాలో దుండగుడి కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థినిప్రాణాలు కోల్పోయారు.హర్సిమ్రత్ రంధవా బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట పరిధిలో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన అమాయకపు యువతులతో ముఠా వ్యభిచారం చేయిస్తోంది. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శనివారం దాడులు చేశారు.
వరంగల్ జిల్లా పెర్కవేడులో కోతులు బీభత్సం సృష్టించాయి. మల్లమ్మ అనే వృద్ధురాలు వేడినీళ్ళతో స్నానానికి వెళ్తుండగా కోతులు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
నిన్న సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ (CMS) కొత్త అధిపతిగా ఓజ్ ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతుండగా ఓజ్ కుమార్తె స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆ సమావేశాన్ని వెంటనే ఆపేయాల్సి వచ్చింది.
హైదరాబాద్‌లో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కేదార్‌నాథ్‌లో ఉన్న అఘోరీ, శ్రీ వర్షిణిల కోసం తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే వీరిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో వీరికోసం పోలీసులు కేదార్నాథ్ వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు అఘోరీ, శ్రీ వర్షిణి ఇష్యూపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది.