Xi Jinping: చైనా సైన్యంలో తిరుగుబాటు? జిన్ పింగ్ మిస్సింగ్?

చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్‌పింగ్‌ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు. ఆయనపై తిరుగుబాటు మొదలైనట్లు ప్రచారం నడుస్తోంది.

New Update
Xi Jinping

Xi Jinping

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్థాన్‌కు చైనా అండగా ఉంది. ఆ దేశానికి చెందిన డ్రోన్లతోనే పాక్‌.. భారత్‌పైకి దాడులకు పాల్పడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు చైనా సాయం చేయడంతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్‌పింగ్‌ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు. 

Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!

భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అంతేకాదు గత రెండు వారాలుగా చైనా ప్రభుత్వ వార్తపత్రికలో కూడా ఆయన కనిపించలేదు. జిన్‌పింగ్‌కు సంబంధించి ఎలాంటి వార్తలు రాలేదు.  ఇటీవల ఆయన కనిపించకుండా పోయినప్పుడు ఆ సమయంలో చైనా ప్రధాని  లీ కెకియాంగ్, ఉప ప్రధాని హీ లిఫెంగ్‌ విదేశీ అధినేతలను కలిశారు.  చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు వాళ్ల పదవుల నుంచి తొలగించబడే ముందు ప్రజల నుంచి కనిపించకుండా పోయారు. 

Also Read: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ

ఇక చైనా ప్రభుత్వం శుక్రవారం ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను వాళ్ల పదవుల నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు చాలామంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా స్టేట్ కౌన్సిల్‌ 50 మందికి పైగా మంత్రులు, చాలామంది అధికారులు జూన్ 6, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కూడా జిన్‌పింగ్ అక్కడ కనిపించలేదు. దీంతో చైనా సైన్యం నుంచి జిన్‌పింగ్‌కు తిరుగుబాటు మొదలైనట్లు ప్రచారం నడుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు