/rtv/media/media_files/2025/07/01/satellite-powered-surgery-2025-07-01-07-52-42.jpg)
Chinese doctors perform first satellite powered surgery on patient 5,000 km away
చైనా వైద్యులు మరో అద్భుతం సృష్టించారు. శాటిలైట్ సాంకేతిక ద్వారా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స అందించారు. వైద్యారోగ్య రంగంలో ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు. ఈ సర్జరీకి పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ రాంగ్ లియూ నేత నేతృత్వం వహించారు. ఈ వైద్య బృందం లాసాలో ఉండి రోబోల సాయంతో 5 వేల కిలోమీటర్ల దూరంలో బీజింగ్‌లో ఉన్న ఇద్దరు రోగులకు కాలేయ సర్జరీలు చేశారు.
Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!
శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్న రోగులకు ఇలా సర్జరీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సర్జరీలు కూడా విజయవంతం అయ్యాయి. దీంతో ఇకనుంచి మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు, విపత్తుల్లో ఇరుక్కున్న ప్రదేశాల్లో ఉండేవారికి శాటిలైట్ సాంకేతికత ద్వారా ఆపరేషన్‌లు చేయొచ్చని వైద్య బృందం తెలిపింది.
ఆపరేషన్ ఎలా చేస్తారు
భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలో ఆప్‌స్టార్ 6డీ అనే శాటిలైట్ ఉంది. దీని సాయంతో 68 ఏళ్ల లివర్ క్యాన్సర్ రోగికి, 56 ఏళ్ల హెపటిక్ హెమాంగియోమా రోగికి శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఈ రెండు ఆపరేషన్లను కేవలం 105 నుంచి 124 నిమిషాల్లోనే పూర్తిచేశారు. లాసాలోని ఆస్పత్రిలో ఉన్న చీఫ్ సర్జన్ రోబోల సాయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి. ఇక ఈ ఆపరేషన్లలో రోగులు కేవలం 20 మిల్లీలిటర్ల రక్తం మాత్రమే నష్టపోయారని.. ఆ తర్వాత వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని తెలిపారు. 24 గంటల్లోనే వాళ్లని ఇంటికి పంపించామని వైద్య టీమ్ పేర్కొంది. ఈ సర్జికల్ రోబోల ద్వారా ఇకనుంచి 5 వేల కిలోమీటర్ల నుంచి 1.50 లక్షల కి.మీ దూరంలో ఉండే రోగులకు కూడా ఆపరేషన్ చేయవచ్చని స్పష్టం చేసింది.