Singayya Death: సింగయ్యను తొక్కి చంపింది జగన్‌ వాహనమే.. ఫోరెన్సిక్‌ నివేదిక

సింగయ్య మృతికి వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చింది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ అధికారులు.. ఘటన సమయంలో సెల్‌ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని వెల్లడించారు.

New Update
YS jagan helicoptor

YS jagan helicoptor Photograph: (YS jagan helicoptor)

Singayya Death: సింగయ్య మృతికి వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చింది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ అధికారులు.. ఘటన సమయంలో సెల్‌ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని వెల్లడించారు. మార్ఫింగ్‌ వీడియోలంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్‌ నివేదిక కీలకంగా మారింది.

Also Read: రాత్రి పడుకునే ముందు పాలు తాగుతున్నారా..? దాని దుష్ప్రభావాలు ఇవే

అవన్నీ ఒరిజినల్‌వే

ఈ మేరకు జగన్ ర్యాలీ సందర్భంగా చిత్రీకరించిన కార్యకర్తల 6 ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపించారు. ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించగా.. అవన్నీ ఒరిజినల్‌వేనని స్పష్టమైంది. ఇక జూన్‌ 18న పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జగన్‌ వాహనం కింద పడి సింగయ్య చనిపోయారు. మొదట దేవినేని అవినాష్‌ అనుచరుడి వాహనం ఢీకొన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వారు అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అనంతరం జగన్‌ వాహనం కింద పడి సింగయ్య మరణించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు మలుపుతిరిగింది. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు