యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్‌ను RTV సంపాదించింది. ఇందులో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల పేర్లు ప్రస్తావించారు. ఈ ముగ్గురుకి స్వేచ్ఛను పూర్ణచందర్ పరిచయం చేశాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతడు ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ పట్టుబట్టినప్పటికీ పూర్ణంచదర్ ఒప్పుకోలేదు. చివరికి స్వేచ్ఛ మృతికి తానే కారణమని పోలీసులు ముందు కూడా అతడు ఒప్పుకున్నాడు.
Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!
మరోవైపు పూర్ణ చందర్ భార్య స్వప్న సంచలన కామెంట్స్ చేసింది. తనకు పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ పరిచయం అయ్యిందని స్వప్న తెలిపింది. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం తనకు తెలియదని, తెలిసిన తర్వాత పూర్ణను వదిలేసినట్లు పేర్కొంది. స్వేచ్ఛ కూతురు అరణ్య పూర్ణచందర్‌పై చేస్తున్న ఆరోపణలు అసత్యమని, తనని సొంత కూతురులా చూసుకున్నాడని స్వప్న తెలిపింది. స్వే్చ్ఛ తనని మానసికంగా టార్చర్ చేసిందని, పూర్ణచందర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందని వెల్లడించింది. తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బెదిరించిందని, తన భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న సంచలన కామెంట్స్ చేసింది.
Also Read: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ
కానీ స్వేచ్ఛ మాత్రం పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అతను చేసిన మోసాన్ని గ్రహించిన స్వేచ్చ అతడి నుండి విడిపోదామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా స్వేచ్ఛతో పూర్ణచందర్ గొడవపడినట్లు సమాచారం. ఇక మొత్తానికి పోలీసులు విచారణలో స్వేచ్ఛ ఆత్మహత్యకు తానే కారణమని పూర్ణచందర్ ఒప్పుకున్నారు.