TG : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..అక్కడ మరో మూడు కాలేజీలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
భార్యకు అనారోగ్య సమస్యలున్న విషయాన్ని దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. వైద్య వృత్తినే ఆయుధంగా మలుచుకుని చికిత్స పేరుతో అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి భార్యను హత్య చేశాడు.ఈ కేసులో బాధితురాలు కూడా డాక్టర్ కావడం గమనార్హం.
ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలి అనుకునేవారు థ్రెడింగ్, వ్యాక్సింగ్ మధ్య తేడా తెలుసుకోవాలి. థ్రెడ్డింగ్ అనేది దారం సహాయంతో వెంట్రుకలను వేరు చేసే పద్ధతి. మెరుగైన, స్పష్టమైన ఆకారాన్ని ఇవ్వడానికి థ్రెడ్డింగ్ ఉత్తమ ఎంపికని నిపుణులు చెబుతున్నారు.
గుజరాత్లో శుక్రవారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్లలో 7 నుంచి 8 మంది మంత్రులకు మాత్రమే పదవులు దక్కుతాయని.. మిగతా వాళ్ల స్థానాల్లో కొత్తవారిని నియమించే ఛాన్స్ ఉంది.
కాంగ్రెస్లో కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. కాగా ఈ రోజు సాయంత్రం కేబినెట్ భేటీ జరగగా దానికి కొండా సురేఖ హాజరుకాలేదు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా సురేఖ ఆమె కూతురు సుష్మిత భేటీ కావడం చర్చనీయంశంగా మారింది.
కేంద్ర సహకారంతో రాష్ర్టానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ తో పాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ తదితర పరిశ్రమలు వచ్చాయన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మరో షాక్ ఇచ్చారు. ఈ రోజు జరుగుతున్న మంత్రి వర్గ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సురేఖ తప్పా మిగతా మంత్రులంతా కేబినెట్ మీటింగ్ కు హాజరైనట్లు తెలుస్తోంది.
దీపావళి పండుగ తర్వాత బుధ గ్రహం సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోంది. అక్టోబర్ 24 శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. 9 రాశుల వారికి అదృష్టం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఉండేవి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా ఉండేవి కావు. నేడు దేశంలో కరెంట్ లేని గ్రామం లేదని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ఆయన కర్నూలు జిల్లాలోని నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో పాల్గొన్నారు.