TG :   తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..అక్కడ మరో మూడు కాలేజీలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

New Update
Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

TG:  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ బిల్లు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

 రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించారు. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని, రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.  శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్ కు కేబినెట్ ఆమోదించింది.ఆ ప్రాజెక్టుకు ఆయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. ఇక రూ.10,547 కోట్లతో 5,566 కి.మీ మేర ప్రతిపాదించిన హ్యామ్‌ రోడ్ల ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఇది కూడా చూడండి: Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్

Advertisment
తాజా కథనాలు