/rtv/media/media_files/2025/05/02/modi-chandrababu-pawan-562676.jpeg)
PM Modi -CM Chandrababu
Chandrababu: కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ తో పాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్, బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమకు త్వరలో హైకోర్టు బెంచ్ రాబోతోందని సీఎం చెప్పారు. రాయలసీమలో స్టీల్, స్పేస్, డిఫెన్స్, ఏరో స్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వీటితో పాటు సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ రావడానికి కారణమైన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు సీఎం వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని సీఎం అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తున్న మోదీ ఓ విశిష్టనేత అని కొనియాడారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారని.. ఆయన 21 వ శతాబ్దపు నేత అని సీఎం వ్యాఖ్యానించారు. ఎలాంటి విరామం లేకుండా ప్రజల సేవలోనే ఆయన అంకితమై ఉన్నారని.. తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారని తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటోందని అన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని... వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్ పవర్ గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా సైనిక పరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటేలా చేశారని ముఖ్యమంత్రి అన్నారు.
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ లాభం
ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్ నినాదంతో వచ్చిన జీఎస్టీ పన్ను విధానంలో ప్రస్తుత సంస్కరణల వల్ల 99 శాతం వస్తువులు సున్నా నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని.. తద్వారా అన్ని వస్తువుల ధరలు తగ్గాయని సీఎం చంద్రబాబు అన్నారు. జీఎస్టీ 2.0తో పన్నులు తగ్గి పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఉపశమనం కలిగిందని అటు వ్యాపారులు, ఎంఎస్ఎంఈ వర్గాలకూ ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ది కలిగించేలా సంస్కరణలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికీ రూ.15 వేల వరకూ ఆదా అవుతుందని స్పష్టం చేశారు. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ సంస్కరణల్ని పండుగలా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 98 వేల ఈవెంట్లు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. జీఎస్టీ బచత్ ఉత్సవ్ కాస్తా ఇవాళ భరోసా ఉత్సవ్ గా మారిందని చంద్రబాబు అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి డబుల్ ప్రయోజనాలు కలుగుతున్నాయని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ గా పొదుపు జరిగిందని సీఎం అన్నారు.
అత్యధిక పెట్టుబడుల రాష్ట్రం
కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టామని, పోలవరాన్ని గాడిన పెట్టామని, విశాఖ ఉక్కును బలోపేతం చేశామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెట్టుబడులు సాధిస్తోందని విశాఖలో ఆర్సెల్లార్ మిట్టల్, 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా హబ్ వస్తోందని, నెల్లూరులో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ రిఫైనరీ వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రాయలసీమకు త్వరలో హైకోర్టు బెంచ్ రాబోతోందని సీఎం చెప్పారు. రాయలసీమలో స్టీల్, స్పేస్, డిఫెన్స్, ఏరో స్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వీటితో పాటు సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ రావడానికి కారణమైన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు సీఎం వ్యాఖ్యానించారు.
ఏపీలో రూ.13,429 కోట్ల కేంద్ర ప్రాజెక్టులు
రాష్ట్రంలో విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు చెందిన రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానం ద్వారా వివిధ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. అలాగే ఇంకొన్నింటిని శంకుస్థాపనలు చేశారు. మరో రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రూ.9,449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇక రూ.2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
అలాగే విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ - రూ. 2886 కోట్లు, ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ - రూ. 4922 కోట్లు, కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు, పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ - రూ. 184 కోట్లు, సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు. ప్రారంభోత్సవాలు: రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు, కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు, కనిగిరి బైపాస్ రోడ్ - రూ. 70 కోట్లు, గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు, కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు – రూ. 13 కోట్లు, పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్ - రూ. 593 కోట్లు, నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు, చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ – రూ. 200 కోట్లు. కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు– రూ. 546 కోట్లు, శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ - రూ. 1730 కోట్లు. ప్రారంభోత్సవాలు చేశారు.
శ్రీశైల మల్లిఖార్జునుడ్ని దర్శించిన ప్రధాని, సీఎం
కర్నూలు విమానాశ్రయం నుంచి శ్రీశైల క్షేత్రానికి హెలికాప్టర్ లో వెళ్లిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న శక్తిపీఠంలోని భ్రమరాంబ అమ్మవారిని దర్శించి.. వేదపండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు. శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రానికి ప్రధాని మోదీ సహా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. స్పూర్తి కేంద్రంలోని దర్బార్ హాల్, ధాన్య మందిరాన్ని ప్రధాని సందర్శించారు.
Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!