Telugu Astrology: దీపావళి తర్వాత వృశ్చిక రాశిలోకి బుధుడు.. ఈ 9 రాశుల వారికి ఇక తిరుగుండదు!

దీపావళి పండుగ తర్వాత బుధ గ్రహం సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోంది. అక్టోబర్ 24 శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. 9 రాశుల వారికి అదృష్టం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.

New Update
Telugu Astrology

Telugu Astrology

దీపావళి పండుగ తర్వాత బుధ గ్రహం సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోంది. బుద్ధి, సంభాషణ, వ్యాపారానికి ప్రతీక అయిన బుధుడు.. అక్టోబర్ 24 శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం నవంబర్ 23 సాయంత్రం 7:58 వరకు కొనసాగుతుంది. వృశ్చిక రాశి నీటి మూలకం, స్థిర రాశి కావడంతో ఇది లోతు, రహస్యం, పరివర్తనను సూచిస్తుంది. బుధుడు ఇక్కడ గోచరించడం వల్ల ప్రజలలో రహస్యాలను తెలుసుకునే సామర్థ్యం, లోతైన ఆలోచన, మానసిక బలం పెరుగుతాయి. ఈ సంచారం పరిశోధన.. జ్యోతిష్యం, గూఢశాస్త్రాలు లేదా మనస్తత్వ శాస్త్రంలో ఉన్నవారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధ సంచారం 9 రాశుల వారికి అదృష్టం, పురోగతిని అందించే అవకాశం ఉంది. ఈ రాశులకు ఆస్తి, కొత్త ఉద్యోగం, వృత్తిలో పురోగతి వంటి శుభ ఫలితాలు కలగవచ్చు.

అదృష్టాన్ని పొందే రాశులు:

మేషం (Aries): వీరికి అకస్మాత్తుగా ధన లాభం, పరిశోధన, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.

వృషభం (Taurus): వైవాహిక జీవితంలో సంభాషణ పెరుగుతుంది. వ్యాపార భాగస్వామ్యాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం (Cancer): ప్రేమ సంబంధాలు గాఢంగా మారతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు మంచి సమయం.

కన్య (Virgo): ధైర్యం, కమ్యూనికేషన్ మెరుగుపడతాయి. రచన, మీడియా, ప్రయాణాల ద్వారా ప్రయోజనం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన కాలం.

ఇది కూడా చదవండి: నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారా..? దాని ప్రభావం మీ మూత్ర పిండాలపై పడుతుంది జాగ్రత్త!!


తుల (Libra): ఆర్థిక విషయాలపై దృష్టి పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి లేదా పెట్టుబడుల నుంచి లాభం పొందవచ్చు. ఖర్చులను నియంత్రించడం ముఖ్యం.

వృశ్చికం (Scorpio): ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి.. తమను తాము వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం.

మకరం (Capricorn): స్నేహితుల ద్వారా లాభాలు.. సామాజిక సర్కిల్ విస్తరిస్తుంది. లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది.

కుంభం (Aquarius): వృత్తిలో పురోగతి ఉంటుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి.

మీనం (Pisces): అదృష్టం, ఉన్నత విద్యపై సానుకూల ప్రభావం. ఆధ్యాత్మికత, తత్వశాస్త్రంపై ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం, విజయం కోసం ఈ రాశుల వారు తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలని.. ఆలోచనాత్మకంగా మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏమైనా సమస్యల నివారణకు సంబంధిత పండితులను  సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ధన్‌తేరాస్ నాడు దీపం వెలిగించడంతోపాటు ఈ 4 పనులు చేయండి.. మీకు డబ్బే డబ్బు!!

Advertisment
తాజా కథనాలు