/rtv/media/media_files/2025/05/16/ynxTXYm4Dbu2RJR71HKd.jpg)
konda surekha
Konda Vs Revanth: కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. కాగా ఈ రోజు సాయంత్రం కేబినెట్ భేటీ జరగగా దానికి కొండా సురేఖ హాజరుకాలేదు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భేటీ అయ్యారు. కొండాసురేఖ ఆమె కూతురు సుష్మిత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోభేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు ప్రజాభవన్‍లో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి నుంచి జరిగిన పరిణామాలు, తన ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించింది. భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో కొండా భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. --- ఇవాళ రాత్రికి వరంగల్‌కు వెళ్లాలని కొండా సురేఖ, సుస్మిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భర్త కొండా మురళి, అనుచరులతో చర్చల తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: మండలం ముగిసిందా..? మిత్ర మండలి రివ్యూ ఇదిగో..!
అయితే కొండా సురేఖ ఈ వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించాలని అనుకున్నట్లు ప్రచారం సాగింది. అయితే సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. మీడియా ముందుకు వెళ్లవద్దని కొండా సురేఖకు ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ మీడియా సమావేశం పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆమె ఈ రాత్రికి వరంగల్ చేరుకుని భర్త మురళితో పాటు అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే కీలక నిర్ణయం తీసుకుని మీడియా సమావేశం నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి: Konda Surekha: మంత్రి ఇంటి దగ్గర ఫుల్ డ్రామా...పోలీసుల ఎదురుగానే ఒకే కారులో వెళ్ళిన సురేఖ, సుమంత్
అసలేం జరిగిందంటే..
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వ తప్పించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే మంత్రి కుమార్తె సుస్మిత వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని సుస్మిత ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్ మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో సమసిపోయేట్లు చూద్దామని ఆమె చెప్పినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Maoist leader Mallojula surrenders : మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు..ఆయన ఉద్యమ ప్రస్థానమిదే..