/rtv/media/media_files/2025/10/16/waxing-and-threading-2025-10-16-16-36-35.jpg)
Waxing and Threading
నేటి కాలంలో ముఖ సౌందర్యానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మహిళలు ముఖ సౌందర్యాన్ని పెంచడానికి లేదా అవాంఛిత రోమాలను తొలగించడానికి థ్రెడ్డింగ్ (Threading), వ్యాక్సింగ్ (Waxing) రెండూ సాధారణంగా ఉపయోగించే పద్ధతులే. అయితే.. చర్మానికి ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది అనే ప్రశ్న తరచుగా వస్తుంది. చర్మతత్వం, నొప్పిని తట్టుకునే శక్తి, వ్యక్తిగత సౌలభ్యం ఆధారంగా సరైన పద్ధతిని ఎంచుకోవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
థ్రెడింగ్-వ్యాక్సింగ్ మధ్య తేడా..
థ్రెడ్డింగ్ అనేది దారం సహాయంతో వెంట్రుకలను వేరు చేసే పద్ధతి. మెరుగైన, స్పష్టమైన ఆకారాన్ని (Defined Shape) ఇవ్వడానికి థ్రెడ్డింగ్ ఉత్తమ ఎంపిక. ముఖ్యంగా కనుబొమ్మల ఆకృతికి ఇది చాలా మంచిది. ఇందులో ఎటువంటి రసాయనాలు ఉపయోగించబడవు కాబట్టి.. సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా చిన్న వెంట్రుకలను కూడా సులభంగా తొలగించవచ్చు. మొదటిసారి చేసేవారికి ఇది కొంత నొప్పిగా అనిపించవచ్చు. చేసిన వెంటనే చర్మంపై ఎరుపుదనం (Redness) లేదా కొద్దిపాటి వాపు వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాక్సింగ్ అనేది వేడి లేదా చల్లని మైనాన్ని ఉపయోగించి.. ఒకేసారి పెద్ద ప్రాంతంలోని వెంట్రుకలను తొలగించే ప్రక్రియని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: చర్మంతో పాటు పాదాలపై ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపమే.. దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి
ఇది చాలా వేగవంతమైన పద్ధతి. వెంట్రుకలు సెకన్లలో తొలగిపోతాయి. అయితే వెంట్రుకలను మూలం నుంచి తొలగిస్తుంది కాబట్టి.. ఫలితం ఎక్కువ కాలం ఉంటుంది. వెంట్రుకలతోపాటు చనిపోయిన చర్మ కణాలు (Dead Skin Cells) కూడా తొలగిపోతాయి.. చర్మం మృదువుగా కనిపిస్తుంది. సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి దద్దుర్లు లేదా దురద వచ్చే అవకాశం ఉందని చర్మ వైద్యులు అంటున్నారు. సరైన సాంకేతికతతో చేయకపోతే.. చర్మానికి నష్టం కలిగే ప్రమాదం ఉంది. తక్కువ వెంట్రుకలను.. లేదా ఖచ్చితమైన ఆకృతిని ఇవ్వడానికి ఇది తక్కువ ఖచ్చితమైనది (Less Precise). అయితే మొదటిసారి ప్రయత్నిస్తున్నట్లయితే లేదా సహజమైన ఆకృతిని కోరుకుంటే థ్రెడ్డింగ్‌తో ప్రారంభించడం మంచిది. రసాయనాలతో అలెర్జీ లేకపోతే.. త్వరగా పని పూర్తి కావాలంటే వ్యాక్సింగ్ ఉత్తమ ఎంపిక. చర్మానికి సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ద్వారా సమస్యలు లేకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: అందమైన మెరిసే చర్మం కోసం అచ్చంగా 6 చిట్కాలు