/rtv/media/media_files/2025/10/16/cabinet-expansion-2025-10-16-17-38-01.jpg)
Ahead of Cabinet expansion, all Gujarat ministers resign
గుజరాత్‌లో శుక్రవారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్లలో 7 నుంచి 8 మంది మంత్రులకు మాత్రమే పదవులు దక్కుతాయని.. మిగతా వాళ్ల స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ సంఖ్య 26కు పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: యో చూసుకోబడ్లా.. లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు - కోర్టు మొత్తం షాక్
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఒక్కరే ఇప్పుడు కేబినెట్‌లో కొనసాగుతున్నారు. ఆయన మంత్రుల రాజీనామా లేఖలను గురువారం రాత్రి గవర్నర్ ఆచార్య దేవ్రాత్‌కు సమర్పించనున్నారు. అయితే మంత్రి పదవిలో కొనసాగే వాళ్ల రాజీనామా లేఖలు మాత్రం గవర్నర్‌కు ఇవ్వబోనట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గాంధీనగర్‌లోని మమతా మందీర్ వద్ద గుజరాత్ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా హాజరు కానున్నారు.
Also Read: ఆ ర్యాంకింగ్ లో చైనాను దాటేసిన భారత్.. అమెరికా, రష్యాల తర్వాత..
గురవారం సాయంత్రం సీఎం భుపేంద్ర పటేల్ నివాసంలో సమావేశం జరిగింది. ఈ భేటీకి బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ సునిల్ బన్సాల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో బన్సాల్, భూపేంద్ర పటేల్ వ్యక్తిగతంగా చర్చించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులకు తెలియజేశారు. ఆ తర్వాతే మంత్రులందరూ రాజీనామా చేశారు. కేబినెట్‌ను పునర్నిర్మించాలనే బీజేపీ ప్రణాళికలో భాగంగానే మంత్రులు రాజీనామా చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
Also Read: డిజిటల్ అరెస్ట్‌కు మరో వ్యక్తి బలి.. రూ.58 కోట్ల సైబర్ మోసం