PM Modi  : కాంగ్రెస్‌ పాలనలో కారు చీకట్లు.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌..ప్రధాని నరేంద్రమోడీ

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు ఉండేవి. కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు కూడా ఉండేవి కావు. నేడు దేశంలో కరెంట్‌ లేని గ్రామం లేదని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ఆయన కర్నూలు జిల్లాలోని నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో పాల్గొన్నారు.

New Update
PM Modi AP Tour Updates🔴LIVE : అమరావతిలో మోదీ | Amravati | CM Chandrababu | Pawan Kalyan | RTV

PM Modi

PM Modi  : కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు ఉండేవి. కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు కూడా ఉండేవి కావు. నేడు దేశంలో కరెంట్‌ లేని గ్రామం లేదని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు  ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ సోదర, సోదరీమణులకు సమస్కారం అంటూ తెలుగులో మోడీ ప్రసంగం మొదలు పెట్టారు. అహోబిలం నరసింహాస్వామి, మహానందీశ్వరుడికి నమస్కారాలు అన్న మోడీ ద్వాదశి జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైల మల్లిఖార్జునుడిని దర్శించుకున్నాను. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించానని తెలిపారు.
 
సోమనాథుడు కొలువైన గడ్డపై పుట్టాను. విశ్వనాథుడికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ అన్నారు. ఆత్మగౌరవం, సంస్కృతికి ఏపీ నిలయమన్న ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి పాత్ర ఉందన్నారు. చంద్రబాబు, పవన్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందన్నారు. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌అధ్వర్యంలో  రాష్ర్టం అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు.2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రోడ్డు రైల్వేలతో పాటు అనేక ప్రాజెక్టులు ప్రారభించుకున్నామని మోడీ వివరించారు. భవిష్యత్తులో ఢిల్లీ అమరావతి కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.ఏపీలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో విజనరి నాయకత్వం ఉందన్నారు.16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందని మోదీ అన్నారు.అభివృద్ధి కోసం ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ కృషి చేయాలన్నారు. కర్నూల్‌ ను డ్రోను హబ్‌ గా మార్చలన్నదే లక్ష్యమన్నారు. ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అవసరమన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన డ్రోన్లు అద్భుతంగా పనిచేశాయన్నారు. మీరు ఇక్కడ సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని మోడి అన్నారు.

 విశాఖపట్నం నుంచే ప్రపంచానికి సేవలు అందబోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. భారత్, ఏపీ అభివృద్ధిని ప్రపంచం గమనిస్తోందని, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయని తెలిపారు. విశాఖలో ఏఐ హబ్, డేటా సెంటర్, సబ్ సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్ట్‌లు రాబోతున్నాయని, దీనికి విశాఖ గేట్‌వేగా మారుతుందని అన్నారు. చంద్రబాబు విజన్‌కు ప్రశంసలు తెలుపుతూ, దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ కేరాఫ్ అని, 15 లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయబోతున్నామని, రైల్వేల్లో కొత్త యుగం ప్రారంభమైందని చెప్పారు.
  
ఈ కార్య క్రమంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు శివుడి జ్ఞాపికను బహుకరించారు. మోదీని శాలువతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సత్కరించారు ప్రధానికి ఆంజనేయస్వామి జ్ఞాపిక అందజేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌.రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. అనంతరం రూ.9,449 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. రూ.2,279 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు.

Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

Advertisment
తాజా కథనాలు