/rtv/media/media_files/2025/10/16/konda-surekha-cm-revanth-reddy-2025-10-16-11-49-49.jpg)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మరో షాక్ ఇచ్చారు. ఈ రోజు జరుగుతున్న మంత్రి వర్గ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సురేఖ తప్పా మిగతా మంత్రులంతా కేబినెట్ మీటింగ్ కు హాజరైనట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు కేబినెట్ మీటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా సురేఖ కోసం ఎదురు చూసి.. రాకపోవడంతో ఆలస్యంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం తన కూతురుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు సురేఖ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ను కూడా సురేఖ కలిశారు. గత కొన్ని రోజులుగా తనకు జరుగుతున్న ఇబ్బందులను వారికి సురేఖ వివరించినట్లు సమాచారం. కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన ఓఎస్డీని టర్మినేట్ చేయడమే కాకుండా.. అతడిని అరెస్ట్ చేసేందుకు తన ఇంటికి రావడంపై సురేఖ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిసైడ్ అయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి కూతురుతో కలిసి ఆమె వరంగల్ వెళ్లనున్నారు. భర్త మురళి, అనుచరులతో చర్చించిన తర్వాత మంత్రి పదవికి రాజానామా చేయనున్నట్లు తెలుస్తోంది.