HCU భూముల అమ్మకం కుదరదు.. సీఎం రేవంత్ కు కేంద్రం షాక్!
కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.