Amith sha: చరిత్రలో తొలి విజయం.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్!

మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్ పెట్టారు. 'నక్సలిజంపై చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మట్టుబెట్టడం ఇదే తొలిసారి. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం' అన్నారు. 

New Update
amith sha

Amit Shah sensational post on Maoist encounter

Amith sha: మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్ పెట్టారు. 'నక్సలిజంపై చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మట్టుబెట్టడం ఇదే తొలిసారి. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం' అన్నారు. 

ఒక మైలురాయి విజయం

ఈ మేరకు 'ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. వారిలో సీపీఐ -మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను నేను అభినందిస్తున్నా. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం' అని కొనియాడారు. 

Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

అలాగే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సలైట్లను అరెస్టు చేయగా, 84 మంది నక్సలైట్లు లొంగిపోవడంపై కూడా సంతోషంగా ఉందని చెప్పారు. చివరగా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

amith-sha | chattisgarh | telugu-news | today telugu news

#maoist #amith-sha #chattisgarh #telugu-news #today telugu news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు