BIG BREAKING: చంద్రబాబుతో విజయసాయి దోస్తి.. ఇదిగో ప్రూఫ్.. జగన్ సంచలనం-VIDEO

కూటమికి మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడని జగన్ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలకు విలువ ఉండదన్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదన్నారు.

New Update

విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లొంగిపోయారని వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ సీటును కూటమికి అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసుపై స్పందించారు. లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే లంచాలు ఇస్తారన్నారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో అమ్మకాలు తగ్గాయన్నారు. దీంతో మద్యం తయారీ సంస్థలు నష్టపోయాయన్నారు. నష్టపోయినప్పుడు మద్యం సంస్థలు లంచాలు ఎందుకు ఇస్తాయి? అని ప్రశ్నించారు. మద్యం విక్రయాలు ప్రైవేటుకి ఇస్తే లంచాలు ఇస్తారన్నారు.
ఇది కూడా చదవండి: AP News: YCP నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ భూమి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం!

తమ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిందన్నారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తే లంచాలు ఎక్కడివి? అంటూ ప్రశ్నలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్‌ కుంభకోణాలు చేస్తోందన్నారు. ఇప్పుడు ప్రతీ మద్యం షాపులో పర్మిట్ రూమ్‌లు ఉన్నాయన్నారు. బియ్యం డోర్ డెలివరీ ఆపి లిక్కర్‌ డోర్ డెలివరీ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు జగన్. ఇప్పుడు MRP కన్నా ఎక్కువ రేట్లకు లిక్కర్ అమ్మకాలు సాగుతున్నాయన్నారు. ఎవరి పాలసీలో లంచాలకు ఆస్కారం ఉందో ఆలోచించాలని సూచించారు. 
ఇది కూడా చదవండి: Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్‌ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత

జూన్ 4న వెన్నుపోటు దినం..

గత ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4ను వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని జగన్ ప్రకటించారు. ఆ రోజున కలెక్టర్లను కలిసి హామీలను అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందిస్తామన్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు జగన్. 

(YS Jagan | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు