/rtv/media/media_files/2025/05/21/jVo7rYoqHMBn8CjffkEa.jpg)
Sunitha Rao Mahila Congress
తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 14న గాంధీ భవన్ లో ఆమె ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ చుట్టాలకు పదవులు వస్తున్నాయంటూ ఆమె వ్యాఖ్యలు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అనంతరం ఆమె పలు మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ పార్టీలో కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయంటూ ఏఐసీసీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వారం రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: TG JOBS: గ్రూప్ 3, 4 పరీక్షల్లో కీలక మార్పులు.. మరో 27 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Breaking
— Telangana Awaaz (@telanganaawaaz) May 21, 2025
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసులు..
ఈనెల 14న పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసిన AICC మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ..
7రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్న అల్కాలాంబ..… pic.twitter.com/WaXubJTe61
మహిళా కాంగ్రెస్ లో కీలకంగా పని చేసిన వారికి పదవులు ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కొట్లాడి జైళ్లకు వెళ్లిన వారికి గుర్తింపు రాకపోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఇచ్చిన నోటీసులపై ఆమె స్పందిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఇది కూడా చదవండి: Rajiv Gandhi: రాజీవ్ గాంధీ చనిపోయేముందు ఏం జరిగిందో తెలుసా ?
(telangana-congress | latest-news | telugu-news)