/rtv/media/media_files/2025/05/20/BWMxBcVuCk1GJIr6FQOZ.jpg)
Mallikarjun Kharge on Operation Sindhur: బీజేపీకి, ప్రధాని మోదీకి దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కర్ణాటకలో జరిగిన సమర్పణ సంకల్ప ర్యాలీలో మాట్లాడుతూ.. దేశం కంటే ప్రధానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్‌ను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పాకిస్తాన్‌పై చిన్న యుద్ధాలకు వెళ్తోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌ని చిన్న యుద్ధంతో పోల్చి.. దానితోనే సరిపెట్టుకున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
For CONG OP SINDOOR was "chhut putt".
— Rahul Shivshankar (@RShivshankar) May 20, 2025
Listen to Kharge who is clearly letting his lust for playing to the galleries get the better of him.
Not one Congress supporter spoke up to disagree, remonstrate. Imagine.
Post Comments on your view... pic.twitter.com/I0fSGDvwop
Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నందుకు ప్రధానిపై ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. అఖిలపక్ష సమావేశాలకు బదులుగా బీహార్ ర్యాలీకి హాజరైన మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది ప్రాణాలను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ప్రధాని మోదీ ఏప్రిల్ 17న కాశ్మీర్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ నిఘా సంస్థలు వద్దని సలహా ఇచ్చాయి. ఆ విషయాన్ని ఎందుకు పెద్దగా పట్టించుకోలేదని, ప్రజలను, ఆర్మీని అప్రమత్తం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
Operation Sindoor Attack | operation sindoor air strike | operation Sindoor | malli karjun kharge | bjp | pakistan