KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!!

కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని ఆరోపణలు వచ్చాయి. పార్టీలో ఆమె అసంతృప్తి వినిపించింది. అయితే కవిత వీటిపై స్పందించక పోవడం కొత్త అనుమానాలకు తెరరేపింది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆమె తీరు వేరుగా ఉంది.

New Update
Kavitha BRS MlC

కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక, కేసీఆర్‌కు కవిత బిగ్ షాక్, కవిత కొత్త పార్టీ ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్ చూసినా.. యూట్యూబ్ థబ్‌నెయిల్ చూసినా ఇదే హెడ్డింగ్. వీటికి ఆజ్యం పోసినట్లుగా వరంగల్ పార్టీ మీటింగ్‌లో జరిగిన తప్పులను లేవనెత్తుతూ కవిత రాసిన ఆరు పేజీల లేఖ గురువారం బయటకు రావడం. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో ఏదో పెద్ద పరిణామం చోటుచేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది కొత్త పార్టీ ఏనా..? బీఆర్ఎస్‌కు కవిత్ అడ్డం తిరుగనున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు వస్తు్న్నాయి. వీటన్నీటికీ కారణాలు కూడా లేకపోలేదు. బీఆర్ఎస్ కవిత తీరు కూడా అలాగే ఉంది. ఆమె చేసే వ్యాఖ్యలు, పార్టీ నాయకులను కలవడం వంటివి అన్నీ పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరగబోతుందని అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత జైలు నుంచి బెయిల్‌పై బయటకు రాగానే కొన్ని నెలలపాటు యాక్టీవ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత ఆమె తీరులో కొంచెం తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది.

BRSలో కొత్త కవిత గుర్తు చేస్తున్న సందర్భాలు ఇవే..

  • తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడినా.. సామాజికంగా సమానత్వం ఇంకా రాలేదని కవిత మేడే వేడుకల్లో అన్నారు. అంటే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిని చెప్పకనే చెప్పేసింది.
  • జైలు జీవితం తర్వాత చాలా రోజుల పాటు సైలెంట్‌గా ఉంది.
  • బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కవిత పోరాటం. ఆయా విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది.
  • కవిత వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహించింది.
  • లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా.. పార్టీ నుంచి కవితకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
  • కవిత జిల్లాల పర్యటనలో కనిపించని మొదటి శ్రేణి నాయకులు, ఆమె వెళ్లిన ప్రతీచోట ద్వితీయ శ్రేణి నాయకులనే కలిసింది.
  • ఇటీవల కాలంలో ద్వితీయ శ్రేణి నాయకులు, ఉద్యమకారులతో మంతనాలు జరిపింది.
  • బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా ఉన్న పాత నాయకుల ఇంటికి వెళ్లి మరీ కవిత పరామర్శించింది.
  • ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని కవిత ఆమె గళం వినిపించింది.
  • తెలంగాణ జాగృతి కమిటీలను కవిత మళ్లీ యాక్టీవ్ చేసింది.
  • నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు, సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయని ఆమె పలు మార్లు అన్నారు. అది స్వంత పార్టీ వాళ్లేనా అనేది ఇప్పుడు అనుమానం రేకెత్తిస్తోంది.
    నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను, నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందనుకుంటున్నా అంటూ ఇటీవల చిట్ చాట్ కవిత అన్నారు.

అంతేకాదు దాదాపు.. రెండు మూడు వారాలుగా కవిత కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె వాటిపై స్పందించకపోవడం అనుమానంగా ఉంది. చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత నిజంగానే కొత్త పార్టీ పెడుతుందా అన్న సందేహాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలపై స్పందించకుండా ఎమ్మెల్సీ కవిత ఇంకా ఎక్కవగా సోషల్ మీడియా, టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. 

  • బీఆర్ఎస్‌లోని లోపాలు.. వైఫల్యాలు.. తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ కవిత ఇటీవల కేసీఆర్‌కు లేఖ రాశారని వారం క్రితం కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి మీడియాతో అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఈ రోజు (గురువారం) కవిత లేఖ బయటకు వచ్చింది. వరంగల్ బహిరంగ సమావేశంలో జరిగిన తప్పులను కవిత లేఖలో లేవనెత్తారు. 
    (telangana | brs-mlc-kavita | kavitha latter to KCR | latest-telugu-news | kcr | kavitha | brs-kavitha | telangana-politcs)



 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు