/rtv/media/media_files/2025/05/22/lDvxXWmyFz9LHWGAFQ8P.jpg)
Telangana Rs. 3,000 crore GST scam
BIG BRAKING: తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం రూ.500 కోట్లు స్కామ్
ఈ మేరకు ఆడిట్‌లో జీఎస్టీ కుంభకోణం ఊహించిన దానికంటే ఎక్కువే ఉందని తేలడం సంచలనం రేపుతోంది. గతంలో 30 కంపెనీల ఆడిట్‌లో రూ.1,757 కోట్లు అవినీతి జరిగినట్లు తేలగా.. మొత్తం 75 కంపెనీల్లో రూ.2,648 కోట్ల అక్రమాలు జరిగినట్లు అంచనా వేశారు. అయితే తాజాగా 45 కంపెనీల లెక్కలు చూడగా మిగిలిన కంపెనీల్లోనూ ఆడిట్చేస్తే మరో రూ.500 కోట్లు అక్రమాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు.
జూన్‌లో సమగ్ర నివేదిక..
మాజీ సీఎస్ సోమేశ్ ఇందులో భాగమైనట్లు పలు ఆధారాలు లభించాయి. అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ఇందులో కీలక పాత్ర పోషించగా.. దీనిపై హైలెవెల్ కమిటీ జూన్ లో సమగ్ర నివేదిక ఇవ్వనుంది. అంతేకాదు ఇందులో ప్రభుత్వ ఏజెన్సీలు ఉండగా అసలు సూత్రధారులెవరు? అనే పక్కా ఆధారాలను సేకరిస్తున్న హైలెవెల్ కమిటీ.. క్రిమినల్ చర్యలకు సిద్ధవుతోంది. ఆయా కంపెనీల నుంచి పూర్తి సొమ్ము రికవరీ చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది.
CID ఆలస్యం..
జీఎంఆర్, జియో ఫైబర్లిమిటెడ్, ఒలెక్ట్రా గ్రీన్టెక్లిమిటెడ్, మంగళ్యా షాపింగ్‌మాల్, ఎల్అండ్ టీ, ఐటీసీ లిమిటెడ్ లాంటి పెద్ద కంపెనీలు ఇన్‌పుట్ ట్యాక్స్క్రెడిట్ స్కామ్‌లో భాగమైనట్లు బయటపడింది. అయితే ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆధారాలు అప్పగించడంలో CID ఆలస్యం చేస్తున్నట్టు సమాచారం. జీఎస్టీ అక్రమాల్లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పేరుతో భారీగా ఎగవేతకు పాల్పడ్డట్లు ఆడిట్‌లో తేలింది. జీఎస్టీ సాఫ్ట్‌వేర్ తయారీలోనూ అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది.
బయటపెట్టిన హైలెవెల్కమిటీ..
ఈ జీఎస్టీ ఆర్థిక మోసాన్ని హైలెవెల్కమిటీ బయటపెట్టింది. కస్టమర్లకు నకిలీ బిల్లులు ఇచ్చి జీఎస్టీ నట్లు గుర్తించింది. సర్క్యూలర్ బిల్ ట్రేడింగ్‌లో పాల్గొని రూ.735 కోట్ల టర్నోవర్ చేసిన బ్లూనైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు 7 కంపెనీలు రూ.129.50 కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉంది. కానీ కేవలం 1.66% (రూ.2.15 కోట్లు) మాత్రమే నగదు రూపంలో చెల్లించారు. మిగిలిన 98.34% ఫ్రాడ్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)లో సర్దుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ 7వ్యాపార సంస్థల మధ్యే బదిలీలు జరిగాయని, బిల్లుల ప్రకారం జీఎస్టీ నంబర్లలో నకిలీ వ్యాపారం జరిగినట్లు నిర్ధారించారు. ఈ-వే బిల్లులలో స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ప్యాసింజర్ ఆటోలు, ప్యాసింజర్ బస్సులు, ట్రాక్టర్లు, కార్లు ఉన్నట్లు వెల్లడించారు.
కంపెనీలన్నింటికీ ఒకే ఫోన్ నంబర్..
1. VCR 8 మీడియా, 2. అమరావతి గ్లోబల్ సొల్యూషన్స్, 3.బ్లూనైన్ టెక్నాలజీస్, 4.లెజెండ్ టెక్నాలజీస్, 5.ఏసీఎస్ టెక్నాలజీస్, 6.టాప్‌నాచ్ కార్పొరేట్ సర్వీసెస్, 7. కోవిడ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఈ కుంభకోణంలో భాగమయ్యాయి. కోటయ్య అలోకం, ప్రభాకర రావు అలోకం, అనిత అలోకం వీటికి డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే వీరందరి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ఒకటే కాగా.. కంపెనీలన్నీ ఒకే ఫోన్ నంబర్‌ను ఉపయోగించడం విశేషం. బ్లూనైన్ టెక్నాలజీస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ 2025 జనవరిలో, జెండ్ టెక్నాలజీస్, టాప్‌నాచ్ కార్పొరేట్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్లను అంతకుముందే రద్దు చేశారు.
Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!
ఇదిలా ఉంటే.. కొంతమంది జీఎస్టీ అధికారులు పలు కంపెనీలకు అనుకూలంగా నడుచుకున్నట్లు బయటపడింది. బేగంపేట్ డివిజన్‌లో ఇచ్చిన షో-కాజ్ నోటీసులు వెనకకు తీసుకోవడం, రద్దు చేసిన రిజిస్ట్రేషన్ పునరుద్ధరించినట్లు వెలుగులోకి వచ్చింది. బ్లూనైన్ టెక్నాలజీస్ ఒక్కటే రూ.18.85 కోట్ల ట్యాక్స్ కట్టాల్సివుండగా కేవలం రూ.20.2 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. లెజెండ్ టెక్నాలజీస్, టాప్‌నాచ్ సర్వీసెస్ నుంచి రూ.15.93 కోట్ల నకిలీ ఐటీసీ తీసుకుంది. ఇక ‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ వాట్సాప్ గ్రూప్‌లో జరిగిన చాటింగ్ ఆధారంగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఆ గ్రూప్‌లోనే ఈ కేసు అత్యంత కీలకమైన ఆధారాలున్నట్లు తెలుస్తోంది.
telangana | scam | telugu-news | today telugu news