/rtv/media/media_files/2025/05/22/T66Cs438eyKitpfXy5NL.jpeg)
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. ఆయనపై మూడు ప్రశ్నలు సంధించారు. పాకిస్తాన్‌తో మోదీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. ఎక్స్ వేధికగా మోదీకి రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు వేస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోతోపాటు ఆయన ప్రశ్నలను ట్వీట్ చేశారు.
1. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు?
2. భారతదేశ ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు?
3. కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది?
मोदी जी, खोखले भाषण देना बंद कीजिए।
— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2025
सिर्फ इतना बताइए:
1. आतंकवाद पर आपने पाकिस्तान की बात पर भरोसा क्यों किया?
2. ट्रंप के सामने झुककर आपने भारत के हितों की कुर्बानी क्यों दी?
3. आपका ख़ून सिर्फ़ कैमरों के सामने ही क्यों गरम होता है?
आपने भारत के सम्मान से समझौता कर लिया! pic.twitter.com/HhjqbjDsaB
గుజరాత్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశలో మోదీ గురవారం మాట్లాడారు. దానిపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం మరుగుతుందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని, పాకిస్తాన్ కోరలు విరిచేస్తామని చెప్పి పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రధాని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం లేదని పాకిస్తాన్ చెబుతున్న మాటలను ఎందుకు నమ్ముతున్నారని ఆయన ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు.
bjp | pm modi | pakistan | india | terrorism | latest-telugu-news