🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC నేతలు తన్నుకున్నారు. సంజీవ రెడ్డి, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ జరగగా పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. ప్రెస్ మీట్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ వివాదం జరిగింది.
విశాఖలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి వెళ్లిపోగా ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
జ్యోతి మల్హోత్రా దుర్మార్గాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అర్ధనగ్న ఫొటోలతో భారత్, పాక్ అధికారులను బుట్టలో వేసి భారీగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్, పలు రాష్ట్రాల లేడీ య్యూటూబర్లను ఇందులో భాగస్వాములను చేసినట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్ట్ సర్జరీ తర్వాత నాని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. 20మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరో 8 మంది లొంగిపోగా వారినుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. ఇక లొంగిపోయినవారికి 24 గంటల్లో రివార్డు డబ్బులు అందజేస్తున్నట్లు ఎస్సీ చెప్పారు.
మంత్రి సీతక్క ఈ రోజు అనాథ చిన్నారులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో అనాథ పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. వారితో సరదాగా ముచ్చటించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ పాల్గొన్నారు.
రాష్ట్రం దివాలా తీసిందని సీఎం ప్రకటిస్తే.. ఆర్థిక మంత్రి భట్టి దీనిపై ఎందుకు స్పందించడం లేదని BJLP నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. రేవంత్ ఆర్థిక ఎమర్జెన్సీ స్టేట్మెంట్ ను మిగతా మంత్రులు వ్యతిరేకిస్తున్నారన్నారు.