మంత్రి నారా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కోరారు. ఈ రోజు మహానాడులో మాట్లాడియన ఆయన ఈ ప్రతిపాదన చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషాయాన్ని చంద్రబాబు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలన్న డిమాండ్ ను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నారు.
నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...మహానాడులో ప్రస్తావించిన ధూళిపాళ్ల నరేంద్ర#NaraLokesh #Mahanadu2025 pic.twitter.com/5bVHtmEqXc
— Yash Bodduluri (@YashTDP_) May 28, 2025
Also Read : కేంద్రం సంచలన నిర్ణయం.. మళ్లీ మాక్‌డ్రిల్
మహానాడు ప్రారంభమైన నాటి నుంచి చర్చ..
ఓ దశలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులను వైరల్ చేశారు. ఇది జనసేన, టీడీపీకి మధ్య యుద్ధంగా మారడంతో పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి ఇలాంటి పోస్టులు పెట్టవద్దని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ వివాదం సమసిపోయింది. తాజాగా మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన నాటి నుంచి లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు అంశంపై చర్చ మొదలైంది.
Also Read : ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే
గత నిరంకుశ పాలనపై తొలి తిరుగుబాటు 'యువగళం పాదయాత్ర' పుస్తకాన్ని సీఎం చంద్రబాబు గారికి అందించిన యువనేత నారా లోకేష్. #NTRLivesOn#Mahanadu2025#TeluguDesamParty#ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/rfEjJyozgt
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) May 28, 2025
పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు ''నా తెలుగు కుటుంబం'' 6 సూత్రాలను రూపొందించిన యువనేత నారా లోకేష్ ను ప్రశంసించిన సీఎం చంద్రబాబు గారు.#NTRLivesOn#Mahanadu2025Begins#Mahanadu2025#TeluguDesamParty#AndhraPradesh pic.twitter.com/v010M4VuOE
— tdpdalam (@tdpdalam) May 28, 2025
Also Read : మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ గూస్‌బంప్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఈ మహానాడులోనే ఆయనకు ఆ పదవిని ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే.. నరేంద్ర రిక్వెస్ట్ పై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న అంశంపై టీడీపీ నేతలతో పాటు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : కౌంట్‌డౌన్ స్టార్ట్.. పుదుచ్చేరిలో ప్రారంభమైన యోగ మహోత్సవాలు.. 6,000 పైగా హాజరు!
tdp mahanadu 2025 in kadapa | nara lokesh | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu