Kannada language:క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?

క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు కన్నడ భాషా వివాదం కొనసాగూతునే ఉంది. గూగుల్‌సైతం కన్నడను వికారమైన భాషగా చూపించగా.. కర్ణాటకలో కన్నడ మాట్లాడని ఉద్యోగులపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కన్నడ భాష వివాదాలపై ప్రత్యేక కథనం చదవండి.   

New Update
kannada lng

Kannada language controversy special story

Kannada language: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి త్రిభాషా విద్యా విధానంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో హిందీ భాషపై తీవ్ర విమర్శలు రావడంతోపాటు, నిరసనలు జరుగూతునే ఉన్నాయి. నార్త్ ఇండియన్ పాలకులు తమపై హిందీని బలవంతంగా రుద్దడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా కన్నడలోనే మాట్లాడాలని డిమాండ్స్ చేస్తున్నారు. బెంగళూర్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ కన్నడలో మాట్లాడే కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించడం విశేషం. కాగా ఇటీవల ఓ బ్యాంక్ మేనేజర్ కన్నడ మాట్లాడనందుకు ట్రాన్స్‌ఫర్ చేయించారు. అయితే తాజాగా నటుడు కమల్ హాసన్.. కన్నడ భాష తమిళనాడు నుంచి పుట్టిందని వ్యాఖ్యానించడంపై కన్నడిగులు మండిపడుతున్నారు. 

Also Read :  జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

తమిళ్ నుంచి కన్నడ కమల్.. 

ఈ మేరకు చెన్నైలో నిర్వహించిన అప్ కమింగ్ మూవీ 'థగ్ లైఫ్' ప్రమోషన్స్ ఈవెంట్‌లో 'కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టింది' అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కమల్ కన్నడ సంస్కృతిని అవమానపరిచారంటూ కర్ణాటక రక్షణ వేదిక సంస్థ చీఫ్ ప్రవీణ్ శెట్టి మండిపడ్డారు. 'కర్ణాటక రాష్ట్రంలో సినిమాలపై ఆదాయం సంపాదించాలనుకుంటున్నారు. మరోవైపు మా భాషను అపహాస్యం చేస్తున్నారు' అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు 'మీరు మళ్లీ కర్ణాటక భాష, ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. మీ సినిమాలను నిషేధించడానికి కూడా మేము వెనుకాడం' అంటూ హెచ్చరించారు. ప్రో-కన్నడ సంఘాలు భారీ స్థాయిలో నిరసనలకు పిలుపునిచ్చాయి. కన్నడ భాష, సంస్కృతిని తక్కువచేసే ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 'కమల్ హాసన్ కన్నడ చరిత్ర గురించి తెలియదు' అని సీఎం సిద్ధ రామయ్య సెటైర్ వేశారు. 

Also Read :  స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ నిర్దారణ.. నటి దీపికా ఎమోషనల్ పోస్ట్!

SBI బ్రాంచ్ మేనేజర్ క్షమాపణ..

బెంగళూరులో SBI బ్రాంచ్ మేనేజర్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. కస్టమర్తో కన్నడ మాట్లాడలేనంటూ ఆమె వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఆమెకు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ ఇచ్చింది. సూర్య నగర ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లో మహిళ బ్రాంచ్ మేనేజర్ తనతో కన్నడలో మాట్లాడాలని కస్టమర్ కోరాడు. కానీ ఆమె కన్నడ మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ‘ఇది కర్ణాటక మేడం. కన్నడ మాట్లాడాల్సిందే' అని కస్టమర్ బలంగా చెప్పాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఆమె.. ‘ఇది ఇండియా.. నీ కోసం నేను కన్నడలో మాట్లాడను. హిందీలోనే మాట్లాడతా’ అని అరిచింది. ఈ వీడియోను భారత ఆర్థిక శాఖ మంత్రికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేశారు. ఇది ఎస్బీఐ దృష్టికి వెళ్లడంతో ఆమెను బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో వెంటనే దిగొచ్చిన ఉద్యోగిని.. కన్నడిగుల మనోభావాలు దెబ్బ తీసి ఉంటే క్షమించాలని కన్నడలో కోరింది. ఇకపై కస్టమర్లతో కన్నడలోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. 

Also Read :  మానవులకు ఇక చావు లేదు.. ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన!

కన్నడ మాట్లాడితే 10 శాతం డిస్కౌంట్.. 

బెంగళూర్ లో ఒక క్యాబ్ డ్రైవర్ కస్టమర్లకు వినూత్న ఆఫర్ ప్రకటించాడు. తన కారులో ప్రయాణించే వారు కన్నడ నేర్చుకోవడానికి ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. మూడు సంవత్సరాలుగా ప్రైవేట్ యాప్ ఆధారిత అగ్రిగేటర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నా  మహేంద్ర.. తన క్యాబ్‌లో ఒక నోటీసును అంటించాడు. తనతో కన్నడలో మాట్లాడటానికి ప్రయత్నించే వారికి 5 శాతం తగ్గింపు లభిస్తుందని అందులో రాశాడు. కస్టమర్ తన క్యాబ్‌లో కన్నడ సంగీతం వింటే, అదనంగా 5 శాతం తగ్గింపు వర్తిస్తుందని, మొత్తం కస్టమర్‌కు 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించడం విశేషం. అలాగే బెంగళూర్ లో ఓ ఆటో డ్రైవర్ తన ఆటో లోపల ఒక పేపర్ అంటించాడు. ప్రయాణీకులకు తన ఆటోలో ప్రయాణించేటప్పుడు కన్నడ నేర్చుకునే విధంగా ఇంగ్లీషులో కన్నడ పదాలను రాశాడు. 'ఆటో కన్నడిగతో కన్నడ నేర్చుకోండి' అనే టైటిల్ కూడా పెట్టాడు. 

తమన్నా ఎందుకు?

నటి తమన్నా సైతం కన్నడ వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం తమన్నాను మైసూర్ శాండల్‌ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. దీంతో కర్ణాటక బ్రాండ్‌గా ఉన్న మైసూర్ శాండల్ కు తమన్నాను ఎందుకు ఎంపిక చేశారంటూ కన్నడిగులు మండిపడ్డారు. కన్నడ నటులు దొరకలేదా అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక ఈ డీల్ కోసం తమన్నా ఏకంగా రూ. 6.2 కోట్లు అందుకుంది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న మైసూరు శాండల్ స‌బ్బుల‌తో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా నియమించారు. 

Also Read :  ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

సోనూ నిగమ్‌పై ఆగ్రహం..

బెంగళూరులో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'కన్నడ, కన్నడ, కన్నడ' అంటూ ఇలాంటి భావజాలంతోనే కదా పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది' అని నిగమ్ అనడంపై కన్నడిగులు పెద్ద ఎత్తున్న ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగానూ నిగమ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో సోనూ నిగమ్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 352(1), 351(2), మరియు 353 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం ముదురడంతో సోనూ నిగమ్ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. 

ఎయిర్ ఫోర్స్‌ అధికారిపై దాడి..

కన్నడ భాష మాట్లాడలేదని ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF) అధికారి షీలాదిత్యా బోస్‌పై ఓ దుండగుడు దాడి చేయడం కలకలం రేపింది. గాయాలతోనే ఆ ఐఏఎఫ్ అధికారి వీడియో రిలీజ్ చేశారు. మోహంపై రక్తం వస్తుండగానే తనపై జరిగిన దాడి గురించి వివరించారు. 'ఈరోజు ఉదయం నేను, నా భార్య ఎయిర్‌పోర్టుకి కారులో వెళ్తున్నాం. అకస్మాత్తుగా ఓ బైక్‌ మా వెనకాలే వచ్చింది. ఆ తర్వాత మాకు అడ్డుతగిలింది. బైక్‌పై వచ్చిన ఆ వ్యక్తి నన్ను కన్నడలో తిట్టడం మొదలుపెట్టాడు. నా కారుపై DRDO స్టిక్కర్ ఉండటాన్ని చూసి కన్నడలో ఏవేవో మాట్లాడాడు. చివరికి నా భార్యను కూడా తిట్టాడు. నా భార్యను తిట్టడాన్ని చూసి నేను తట్టుకోలేకపోయా. కారు నుంచి నేను బయటకు దిగే సమయంలో అతడు నా నుదిటిపై బైక్‌ కీ తో దాడి చేశాడు. రక్తం వచ్చింది. ఆర్మీలో పనిచేసే వాళ్లతో ఇలానే వ్యవహరిస్తారా అని నేను అతడ్ని అడిగాను. అక్కడికి చాలామంది వచ్చారు. కానీ వాళ్లు కూడా మమ్మల్ని తిట్టడం ప్రారంభించారు. అనంతరం ఆ వ్యక్తి ఒక రాయిని తీసుకొని నా కారుపై దాడి చేసేందుకు యత్నించాడు' అని ఆవేదన వ్యక్తం చేయడం సంచలనం రేపింది. 

వికారమైన భాష..

భారత్‌లో వికారమైన భాష ఏది అంటూ ఇటీవల గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ‘కన్నడ’ అని చూపించడంపై కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమ భాష నెటిజన్‌లకు సులువుగా ఉండదని పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో గూగుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక సహా దేశ విదేశాల్లో నివసిస్తున్న కన్నడిగులు ట్విటర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలాంటి వెబ్‌సైట్లను ముందు వరుసలో ఉంచడాన్ని తప్పుపట్టారు. మొత్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. 

బెంగళూరు నుంచి పూణేకు మకాం..

బెంగళూరులో పెరుగుతున్న భాషా ఉద్రిక్తతల నేపథ్యంలో నగరానికి చెందిన టెక్ వ్యవస్థాపకుడు కౌశిక్ ముఖర్జీ తన కంపెనీ కార్యకలాపాలను ఆరు నెలల్లోపు పూణేకు మకాం మార్చాలని ప్రకటించారు. కన్నడ మాట్లాడని సిబ్బందిపై పెరుగుతున్న ఒత్తిడి 'భాషా అర్ధంలేనిది'గా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

telugu-news | today telugu news

#kannada #language #Kamal Haasan #telugu-news #today telugu news
Advertisment
Advertisment
తాజా కథనాలు