కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం కొత్త పంచాయితీకి దారి తీసింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన0 ఎమ్మెల్యేలు ఈ రోజు సీక్రెట్ గా సమావేశం కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరు సమావేశం అయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ కు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వివిధ కారణాలతో హాజరుకాలేదని తెలుస్తోంది. వారితో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. అసలైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఈ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని నిర్ణనయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దామోదర్ రాజనర్సింహ మంత్రివర్గంలో ఉన్నా కూడా అయన మాదిగ కాదని.. ఉప కులానికి చెందిన వ్యక్తి అని వీరు వాదిస్తున్నారు.
BIG BREAKING: సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్.. వారి డిమాండ్ ఇదే!?
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఉప కులాలకు చెందిన వారిని కాకుండా అసలైన మాదిగకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని మీటింగ్ లో నిర్ణయించారు.
New Update
తాజా కథనాలు