/rtv/media/media_files/2025/05/27/nrk6rTs53Ju6G30a6OnL.jpg)
AP CM Chandrababu emotional speech Kadapa TDP Mahanadu
TDP Mahanadu: కార్యకర్తలే టీడీపీకి అసలు సిసలైన అధినేతలని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని, ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం తగ్గలేదంటూ కడప మహానాడు సభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అన్నారు.
ప్రాణం-ఆయుధం కార్యకర్తలే..
ఈ మేరకు మంగళవారం కడపలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో చంద్రబాబు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతిని వెలిగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని అన్నారు. విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి అండగా ఉండి సంక్షేమం అందిస్తామని చెప్పారు.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
అదే జోరు అదే హోరు..
'అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్. రాష్ట్రం ఫస్ట్ మన సంకల్పం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక పార్టీ. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు.. నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటంచేశాం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడు అంటే అదే జోరు. అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులందరికీ స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. మహానాడులా వేలాదిమంది ప్రతినిధులతో మంచిచెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమే' అన్నారు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
43 ఏళ్ల ప్రస్థానం..
ఇక రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేదని, కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే ఈసారి 10కి 10 తామే గెలుస్తామన్నారు. ఏమీ ఆశించకుండా దశాబ్ధాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నాం. దీన్ని ప్రతి నేత కూడా గుర్తుంచుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడినవారి పనే అయిపోయింది కానీ టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర, లోకేష్ యువగళం వరకూ కార్యకర్తల్లో అదే స్పూర్తి ఉందన్నారు.
Also Read: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల జీవితాలను ఇంతలా ప్రభావితం చేసిన పార్టీ మాత్రం టీడీపీనే. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకూ అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావం ముందు, తర్వాతగా చూడాలి. టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్. మనందరం టీడీపీ రాజకీయ పాఠశాలలో విద్యార్థులమే. తాను నిత్య విద్యార్థిగా ఉంటానన్నారు. ప్రతిరోజూ నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడతానని చెప్పారు. జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు.
Also Read: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
మనది పొలిటికల్ గవర్నెన్స్. ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి వారి ద్వారా పాలన జరిగినప్పుడు నిజమైన పొలిటికల్ గవర్నెస్ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. మహానాడు ద్వారా ఒకటే చెబుతున్నాను. ఏపీని, తెలుగుజాతిని నెంబర్ వన్ చేసే వరకూ నిరంతరం పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
cm chandrababu | telugu-news | today telugu news