/rtv/media/media_files/2025/05/27/ysobKwhv0zFKtr5Iw32H.jpg)
Telugu Political News
Telugu Political News: సమాజంలో ఆస్తి కోసం చీలిన కుటుంబాల కంటే అధికారం కోసం చీలిన కుటుంబాలు తక్కువే. అయినప్పటికీ అవి రాజకీయాల్లో చాలా ప్రభావం చూపించాయి. ఓ పెద్ద తలకాయ.. ఆ వారసత్వం కోసం వెనుక ఎన్నో యుద్ధాలు. చెట్టు పేరు చెప్పుకొని బతికే కాయలు అనే తెలుగు సామెత మనం వినే ఉంటాము. ప్రస్తుత పరిస్థితి వివరించడానికి ఈ సామెత కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణాని ఏకం చేసిన కేసీఆర్ ఇప్పుడు తన సొంత కుటుంబాన్ని ఒక్కటి చేయలేకపోతున్నారు. 25 ఏళ్ల ఉద్యమ పార్టీలో కవిత లేఖ కల్లోలం సృష్టించింది. తెలంగాణ రాజకీయాల్లో, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరగబోతుందో ఎవ్వరు ఊహించలేకపోతున్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో కుటుంబం విడిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె కొత్త పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో తిరుగుబాటు చేసి కవిత మరో షర్మిలా కాబోతుందని కాంగ్రెస్, భాజాపా నాయకులు అంటున్నారు. మొదట NTR, తర్వాత వైఎస్‌ఆర్.. ఇప్పుడు కేసీఆర్. పురందేశ్వరీ, షర్మిలా, కవిత ముగ్గురూ తండ్రి పేరు చెపుకుంటూనే రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ అధికారం కోసం ముక్కలైన కుటుంబాలు, వాటి వెనుక నేపథ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
అన్నకు బాణం ఎక్కు పెట్టిన చెల్లెళ్లు
కేసీఆర్ దేవుడు.. కాకపోతే ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని కవిత అన్న ఒక్క మాటలతో ఆమెలోని అసంతృప్తి బయటపెట్టింది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరా దెయ్యాలని పూటకో పేరు బయటకొస్తోంది. జాగృతి నాయకురాలు అంతటితో ఆగకుండా రహస్యంగా కొత్తమంది నాయకులను కలుస్తోంది. దీంతో కవిత త్వరలో పార్టీ పెట్టబోతుందని వార్తలకు బలం చేకురింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ ఫ్యామిలీ 2 ముక్కలైంది. కేసీఆర్ ఉండగానే ఇప్పుడు వారి కుటుంబంలో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి పేరు మీద 2011 మార్చి 12న YSR కాంగ్రెస్ పార్టీ పెట్టిన జగన్‌కు తోడబుట్టిన చెల్లే ఎదురు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్, కవిత మధ్య వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్
సినిమాల్లో పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు.. తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అక్టోబర్ 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ గురించి ఆలోచనను బయటపెట్టారు. టీడీపీని స్థాపించిన 9నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 292 స్థానాలకు గాను 202 సీట్లు గెలిచింది. 60 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ గెలిచింది. 1984లో నాదెండ్ల భాస్కర్ సొంతపార్టీ టీడీపీలో తిరుగుబాటు లేవనెత్తారు. ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ చేయించుకోడానికి అమెరికా వెళ్లినప్పుడు తెలుగుదేశం పార్టీని ఆయన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. అది కుదరలేదు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారు. తర్వాత 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుట్ర జరిగింది. పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లింది. తనకు ద్రోహం చేశారంటూ ఎన్టీఆర్ 1996 జనవరిలో మరణించాడు. ఆయన కొడుకు హరికృష్ణ పార్టీ నుంచి బయటకు వచ్చి 1999 జనవరి 26న అన్న తెలుగుదేశం అనే కొత్త పార్టీ స్థాపించారు. ఆ పార్టీ అంతగా ప్రజల్ని ఆకట్టుకోలేక పోయింది. దీంతో 2006లో హరికృష్ణ మళ్లీ టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరీ కూడా తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి రెండు సార్లు ఎంపీగా గెలిచింది. కేంద్రమంత్రిగా కూడా ఆమె పని చేశారు. తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరి ప్రస్తుతం రాజమంత్రి ఎంపీగా ఉన్నారు.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
జార్ఖండ్‌లో శింబు సోరెన్
ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్‌లో ఉద్యమించిన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా. 1972 ఫిబ్రవరి 2న శింబు సురెన్ స్థాపించారు. 2000లో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాజకీయాలను శాసించిన శిబూ సోరెన్ కుటుంబం కూడా ఇంటి పోరును ఎదుర్కొంటోంది. శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ సొంత పార్టీ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. దుమ్కా స్థానం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగారు. 1980 తర్వాత ఒకటి రెండు ఎన్నికలు మినహా దుమ్కా సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధీనంలో ఉంది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్.. శిబు సోరెన్‌పై విజయం సాధించారు. సీతా సోరెన్ బీజేపీలో చేరిన తర్వాత ఆమెనే బరిలోకి దించారు. సీతా సోరెన్‌పై దుమ్కా నియోజవర్గంలో జేఎంఎం నలిన్ సోరెన్ గెలిచారు. ఆ పార్టీకి సొంత కుటుంబం నుంచి వ్యతిరేకంగా నిలబడ్డారు.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
ముంబైలో బాల్ థాక్రే
బాల్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనపై రాజ్ ఠాక్రే 2005లో తిరుగుబాటు చేసి విడిపోయారు. ఆ సమయంలో బాల్ ఠాక్రే వయస్సు సుమారు 80 సంవత్సరాలు. రాజ్ ఠాక్రే విడిపోవడంతో బాలా ఠాక్రే తన కొడుకు ఉద్ధవ్‌తోనే ఎక్కువగా గడిపారు. 2006లో రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 13 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత రాజ్ ఠాక్రే పార్టీ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. ఇక 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేయడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. రాజ్ ఠాక్రే కాకుండా నారాయణ్ రాణే, ఛగన్ భుజ్‌బల్ కూడా శివసేనను వీడారు. కానీ, ఏక్‌నాథ్ శిందేలా నిలదొక్కుకోలేకపోయారు. బాల్ ఠాక్రే బతికుండగా బీజేపీ కూడా శివసేనకు మద్దతుగా ఉండేది. ఠాక్రే మరణానంతరం బీజేపీ ప్రాబల్యం పెంచుకుంది. ఏక్‌నాథ్ తిరుగుబాటుతో ఉద్ధవ్ శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు అయిన బాణం, విల్లు రెండింటినీ వదులుకోవాల్సి వచ్చింది.
శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్
కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ ముగ్గురు కలిసి 1999 మే 25న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. వారే శరత్ పవార్, అన్వర్, పి. ఎ. సంగ్మా లు. శరత్ పవర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నారు. శరత్ పవర్ అన్న కొడుకు అజిత్ పవర్ ఆ పార్టీలోనే ఉంటూ తిరుగుబాటు చేశారు. సొంత బాబాయిని వెనక్కి నెట్టి NCPని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు. దీంతో ఆ పార్టీ రెండు ముక్కలుగా చీలింది. ఓవైపు ఏక్‌నాథ్ శిండే శివసేన పార్టీ బీజేపీ, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీతో పొత్తు పెట్టుకోగా.. మరోవైపు ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంది. 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన పార్టీ అభ్యర్థులు 95 స్థానాల్లో పోటీ చేయగా 20 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు. ఏక్‌నాథ్ శిండే 81 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టారు.. వారు 57 సీట్లు గెలుచుకున్నారు. బాల్ ఠాక్రే జీవించి ఉండగా శివసేనను వీడిన వారైనా, పార్టీపై తిరుగుబాటు చేసిన వారైనా రాజకీయాల్లో రాణించలేక పోయారు.
political family | political-family-war | sharmila | bjp-purandeswari | daggubati-purandeswari | brs mlc kavitha | kcr | latest-telugu-news