BIG BREAKING: సంచలన ఆడియో బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత!

ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇదంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. విద్యార్థులతో పని చేయించాలంటూ ఓ అధికారి ఆదేశిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది.

New Update
Kavitha

Kavitha

ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇదంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. విద్యార్థులతో పని చేయించాలంటూ ఓ అధికారి ఆదేశిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు  ప్రతి నెల బీఆర్ఎస్  ప్రభుత్వం రూ.40,000 కేటాయిస్తే నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసే వారని కవిత పేర్కొన్నారు. వీరు టాయిలెట్లు,యు తరగతి గదులు శుభ్రం చేసేవారన్నారు. గతేడాది ఆగస్టునుండి ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. దీంతో పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాల్సి వస్తుందన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాల లోని వాచ్ మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు.

బోర్డు తుడవడం, టాయిలెట్ కడగడం ఒకటి కాదు..

రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెబుతున్నారన్నారు. ఇప్పటివరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణ చూసుకున్నా పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారన్నారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ, మెస్ పనులు కూడా చేయవలసి వస్తోందన్నారు. శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరమని ఫైర్ అయ్యారు కవిత. ఇక్కడ ఆడియోలో వర్షిని చెప్పిన దాంట్లోనే సమాధానం ఉందన్నారు. బోర్డు తుడవడం టాయిలెట్ కడగడం ఒకటి కాదన్నారు. మేడం గారి పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా? అని ప్రశ్నించారు. 

''సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే పిల్లలు ఏమైనా పోష్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్  రాదు అనడం.. ఎందుకు ఇలాంటి పనులు చేయరు చేయాల్సిందే'' అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గమన్నారు. ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేదని అన్నారు. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదన్నారు. కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తక్షణమే ఆ అధికారిని తప్పించాలని డిమాండ్ చేశారు. నెలకు మెయింటెనెన్సు డబ్బులు పాఠశాలలకు ఇవ్వాలన్నారు. పిల్లలతో పనిచేయించటం ఆపివేయాలన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు