/rtv/media/media_files/2025/05/25/SvqXtwM4U6t1Cz66f7kZ.jpg)
Donald Trump Again Attacks on Harvard University, defends block on foreign students
హార్వర్డ్ యూనివర్సిటిపై ట్రంప్ మరోసారి సంచలన పోస్టు చేశారు. ఆ వర్సిటీలో 31 శాతం మంది విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉన్నారన్నారు. ఆ విద్యార్థుల పేర్లు, దేశాల వివరాలకు తమకు అందిచాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరారు. ఇక హర్వార్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి ఉన్న పర్మిషన్‌ను ఇటీవల ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి ఫెడరల్ న్యాయమూర్తి అడ్డుకున్నారు. దీంతో ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకంటూ ఆదివారం ట్రత్ సోషల్‌లో దీనిపై మరోసారి పోస్టు చేశారు.
Also read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు
Also Read : ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ.. గంగుల కమలాకర్ సంచలన ప్రకటన!
Donald Trump Again Attacks On Harvard University
హార్వర్డ్ తమ యూనివర్సిటీలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఆ విద్యా్ర్థుల్లో అమెరికా వ్యతిరేక దేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఆయా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ చదువుల కోసం డబ్బులు కట్టడం లేదు. ఆ విదేశీ విద్యార్థుల వివరాలు మేము తెలుసుకోవాలి. హార్వర్డ్‌కు మేము బిలియన్ డాలర్లు చెల్లించాం. అందుకే మాకు ఆ విద్యార్థుల పేర్లు, వారి దేశాల వివరాలు కావాలి. మీ దగ్గర 52,000,000 డాలర్లు (రూ.442 కోట్లు ఉన్నాయి). వాటిని వాడుకోండి. డబ్బు కోసం ఫెడరల్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయొద్దని'' ట్రంప్ రాసుకొచ్చారు.
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
మరోవైపు ఇటీవల హార్వర్డ్‌కు ఇచ్చే నిధుల్లో ఇటీవల ట్రంప్ ప్రభుత్వం కోత విధించింది. అలాగే విదేశీ విద్యార్థులను వర్సిటీలో చేర్చుకనే అనుమతిని కూడా రద్దు చేసింది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ట్రంప్ నిర్ణయం అనైతికమైనదని, ఇది రూల్స్ ఉల్లంఘించడమేనని హార్వర్డ్ తెలిపింది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్డు న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
Trump Vs Harvard | rtv-news | telugu-news | international news in telugu | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu