Hyd Fire accident: గుల్జార్హౌస్ అగ్నిప్రమాదానికి కారణమదే.. సంచలన విషయాలు వెల్లడించిన అధికారులు
పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలు నిరంతరాయంగా నడుస్తున్నాయని దీనివల్ల ఒత్తిడి ఎక్కువై పేలిపోయాయని అధికారులు గుర్తించారు,